Bimbisara - Sitharamam:శుక్రవారం విడుదలైన 'బింబిసార', 'సీతారామం' చిత్రాలకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లు ఈ రెండు సినిమాల కారణంగా కళకళలాడుతున్నాయి. దాంతో చిత్రసీమలో ఓ పండగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం నిర్మాతలు షూటింగ్స్ ను ఆపేసి, తమ సమస్యలపై వివిధ శాఖలతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఒకే రోజు విడుదలైన రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
F2F With TammaReddy Bharadwaja: ప్రస్తుతం టాలీవుడ్లో పలు సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసం టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ షూటింగులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సంక్షోభానికి నిర్మాతలే కారణమని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆరోపించారు. ఎన్టీవీ ఆయనతో ప్రత్యేకంగా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ నిర్వహించగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం సినిమా పరిశ్రమ వక్రమార్గం తీసుకుందని తమ్మారెడ్డి అన్నారు. గత ఐదేళ్లుగా…
Pooja Hegde: చాలా రోజుల తర్వాత టాలీవుడ్ కి కళ వచ్చింది. ఒకేరోజు విడుదలైన రెండు సినిమాలకు మంచి టాక్ రావటంతో పాటు ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. వాటిలో ఒకటైన 'సీతారామం' సినిమాను అందరూ క్లాసిక్ మూవీ అని, ఎపిక్ లవ్ స్టోరీ అని పొగిడేస్తున్నారు. ఇక ఇందులో సీతగా లీడ్ రోల్ పోషించింది మృణాల్ ఠాగూర్. పాత్రలోని డెప్త్ వల్ల అమ్మడికి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. తెలుగు నేర్చుకుని మరీ ఆ పాత్ర పోషణ చేయటం…
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది.. ప్రముఖ హాస్యనటుడు కడాలి జయ సారధి ఇవాళ ఉదయం కన్నుమూశారు.. ఆయన వయస్సు 83 సంవత్సరాలు.. కిడ్నీ, లంగ్స్ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. నెల రోజులుగా హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 2.32 గంటలకు మృతి చెందారు.
ఈ రోజు జరిగిన ఫిలిం ఛాంబర్ జనరల్ బాడీ మీటింగ్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగులు బంద్ కానున్నాయి. ఇప్పటికే రన్నింగ్‌లో ఉన్న సినిమా షూటింగ్‌లు కుడా జరగవు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Ashwini Dutt: టాలీవుడ్లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ అంశంపై వివాదం నడుస్తోంది. తాజాగా ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ప్రొడ్యూసర్స్ గిల్డ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో నిర్మాతల శ్రేయస్సు కోసమే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏర్పాటైంది కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎందుకు వచ్చిందో తెలియట్లేదని అశ్వినీదత్ ఆరోపించారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గడానికి ప్రొడ్యూసర్స్ గిల్డ్‌లోని కొందరు నిర్మాతలే కారణమని.. వాళ్లకు ఇష్టం వచ్చినప్పుడు టిక్కెట్ రేట్లు పెంచి.. కష్టం వచ్చినప్పుడు తగ్గించాలని కోరడంతోనే అసలు సమస్య…
Star Hero’s Remuneration in tollywood: టాలీవుడ్లో ప్రస్తుతం సంక్షోభం నెలకొంది. సినిమాల బడ్జెట్లు పెరిగిపోవడంతో ఏం చేయాలో అర్ధం కాక ఆగస్టు 1 నుంచి షూటింగులు నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో సెట్స్‌పై ఉన్న సినిమా షూటింగులన్నీ ఆగిపోయే పరిస్థితి ఉండటంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగాడు. ఆయన పలువురు స్టార్ హీరోలతో కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం అందుతోంది. టాలీవుడ్లో షూటింగుల బంద్‌పై అగ్రహీరోలతో…