Tollywood: తెలుగు చిత్ర నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకొంది. చిత్ర పరిశ్రమలోని అన్ని సమస్యలకు పరిష్కారం దొరికేవరకు షూటింగ్స్ ను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Tollywood: ఆగస్ట్ 1 నుండి సినిమాల షూటింగ్స్ బంద్ చేయాలనే నిర్ణయానికి మద్దతు రోజు రోజుకూ పెరుగుతోంది. గత వారం రోజులుగా షూటింగ్స్ ఆపేసి, అందరూ కలిసి భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించాలనే మాట బాగా వినిపిస్తోంది. అయితే కరోనా కారణంగా ఇప్పుడే కుదురుకుంటున్న టైమ్ లో తిరిగి షూటింగ్స్ ను బంద్ చేయడం కరెక్ట్ కాదని మరి కొందరు నిర్మాతలు చెబుతున్నారు.
ఉత్తమ చిత్రం : సూరారై పొట్రు (తమిళ) ఉత్తమ వినోదాత్మక చిత్రం: తానాజీ (హిందీ) ఉత్తమ బాలల చిత్రం : సుమి (మరాఠి) ఉత్తమ నటుడు : సూర్య (సూరారై పొట్రు), అజయ్ దేవగణ్ (తానాజీ) ఉత్తమ నటి : అపర్ణ బాలమురళి (సూరారై పొట్రు) ఉత్తమ దర్శకుడు : కె. ఆర్. సచ్చిదానందన్ (అయ్యప్పనుమ్ కోషియం) ఉత్తమ నూతన చిత్ర దర్శకుడు: మడోన్నా అశ్విన్ (మండేలా) ఉత్తమ సహాయ నటుడు : బిజూ మీనన్ (అయ్యప్పనుమ్…
Tollywood: ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోబోతుందా..? అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. కరోనా తరువాత ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమ కోలుకొంటుంది.
పెళ్లయ్యాక హీరోయిన్లు దాదాపు సినిమాలకు దూరంగా ఉంటారు. ఇక తల్లి అయ్యాక మాత్రం పూర్తిగా స్వస్తి పలుకుతారు. తమ భర్త, పిల్లలతో హ్యాపీగా వ్యక్తిగత జీవితంలో లీనమైపోతారు. ఒకవేళ భాగస్వామి నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే, తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారు. ఇలా కొందరు కథానాయికలు పునరాగమనం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వీరి జాబితాలోకి త్వరలో కాజల్ అగర్వాల్ చేరబోతోంది. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ప్రస్తుతం మదర్హుడ్ని ఎంజాయ్ చేస్తోన్న ఈ నటి..…
ఒకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్లో బిజియెస్ట్ హీరోయిన్. ప్రతీ స్టార్ హీరో సినిమాలో కచ్ఛితంగా కనిపించేది. దర్శకనిర్మాతలందరూ ఈమె డేట్స్ కోసం క్యూలో నిల్చునేవారు. అలాంటి భామ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కనుమరుగైంది. చివరిసారిగా ‘కొండపొలం’ చిత్రంలో కనిపించిన ఈ అమ్మడి చేతిలో ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఓవైపు ఫ్యాన్స్ ఈమె కోసం వేచి చూస్తుంటే.. ఈ భామ మాత్రం హిందీ సినిమాలు చేసుకుంటూ బాలీవుడ్లోనే సెటిలైపోయింది.…
టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో కృష్ణవంశీ ఒకరు. అయితే కొంతకాలంగా ఆయన సినిమాలు ప్రేక్షకులకు రుచించడం లేదు. కృష్ణవంశీ కూడా ప్రేక్షకుల అభిరుచి మేరకు సినిమాలను తెరకెక్కించలేకపోతున్నారు. గులాబీ, నిన్నే పెళ్లాడతా, సింధూరం, మురారి, ఖడ్గం, చందమామ వరకు గుర్తుండిపోయే సినిమాలు తీసిన కృష్ణవంశీ ఆ తర్వాత హిట్ అందుకోలేకపోయారు. లేటెస్టుగా ఆయన ‘రంగ మార్తాండ’ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ…