Srihan: ‘బిగ్ బాస్’ సీజన్ 6 కంటెస్టెంట్ శ్రీహాన్ హౌస్ లోపల అందరి అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేస్తుంటే, బయట అతనితో సినిమా నిర్మించిన ప్రొడ్యూసర్స్ దాని ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. శ్రీహాన్‌తో పాటు ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘ఆవారా జిందగీ’. ఫన్ ఓరియంటెడ్ గా యూత్‌ను టార్గెట్ చేసుకుని ఈ మూవీని నంద్యాల మధుసూదన్ రెడ్డి నిర్మించాడు. దేప శ్రీకాంత్ రెడ్డి దీనికి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. సినిమా కథను రిప్రెజెంట్ చేసేలా నలుగురు కుర్రాళ్లతో దీన్ని డిజైన్ చేశారు. పోస్టర్‌లో కనిపిస్తున్న చార్మినార్, పిస్తోల్, 2000 రూపాయల నోట్లుతో పాటు నలుగురు కుర్రాళ్ళ లుక్స్ చూస్తుంటే… ఇది సమ్ థింగ్ స్పెషల్ మూవీ అనే విషయం అర్థమైపోతోంది. హైదరాబాద్ నగరంలో ఆ నలుగురు చేసే ఆవారా పనులేమిటీ? వాటిని వినోదాత్మకంగా ఎలా చూపబోతున్నారు? అనేది తెలియాల్సి ఉంది. ‘జీరో లాజిక్ 100% ఫన్’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ‘ఆవారా జిందగి’ షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. అతి త్వరలోనే మూవీకి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్‌ను ఇస్తామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.