Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ సతీమణి మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె అస్థికలను మహేశ్ హరిద్వార్ తీసుకెళ్లి అక్కడ గంగలో కలిపారు. కొన్ని నెలల క్రితమే మహేష్ బాబు తన సోదరుడు రమేష్ బాబును కోల్పోయాడు. ఇక ఇప్పుడు ఎంతగానో ఇష్టపడే తల్లి కూడా తనువు చాలించడంతో మహేష్ బాబు ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిపోయాడు. ఇక ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలను కూడా మహేష్ బాబు ప్రత్యేకంగా దగ్గరుండి పూర్తి చేశాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు తన తల్లి గురించి చాలా ఇంటర్వ్యూలలో ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు. ఎన్ని టెన్షన్లు ఉన్నా కూడా అమ్మ చేతి కాఫీ తాగితే ఆ టెన్షన్స్ అన్నీ కూడా తీరిపోతాయి అని చాలా ఇంటర్వ్యూలలో తెలియజేశాడు. హఠాత్తుగా ఆమె చనిపోవడంతో శోకసంద్రంలో మునిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి మహేష్ బాబుకు చాలా సమయం పడుతుంది అని అర్థమవుతుంది. అయితే ఇదే తరుణంలో మహేష్ బాబు హిందూ ఆచారాల ప్రకారం అంత్యక్రియల్లో పాల్గొని ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలను కూడా బాధ్యతతో నిర్వహిస్తున్నాడు.
Read Also: Adipuruash: ‘ఆదిపురుష్’లో ఆ సీన్లు తొలగించాల్సిందే.. ఎంపీ హోంమంత్రి
తల్లి అస్థికలతో మహేష్ ఇక మహేష్ బాబు ఇటీవల తల్లి అస్థికలతో కనిపించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేశ్ తల్లి కర్మలు చేసేందుకు సాంప్రదాయ దుస్తులను ధరించారు. లుంగి పంచె కట్టుకుని ఆయన మెడలో కండువాతో పూజల్లో పాల్గొన్నారు.
తల్లి మృతి చెందడంతో మహేష్ ప్రస్తుతం సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు అని తెలుస్తోంది. ఇదివరకే సినిమా షూటింగ్ మొదలు పెట్టిన మహేష్ బాబు తల్లి మృతి చెందడంతో ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన చర్చల్లో పాల్గొనడం లేదు. పూర్తి స్థాయిలో మహేష్ బాబు ఆ బాధ నుంచి కోలుకున్న తర్వాతనే షూటింగ్ మొదలుపెట్టాలి అని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.