Chiranjeevi – Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నేడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శివశంకర వర ప్రసాద్ గారు అనే టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో మనకు చివర్లో ఓ షాట్ కనిపిస్తోంది. గుర్రాన్ని పట్టుకుని చిరంజీవి స్టైల్ గా నడుచుకుంటూ వస్తాడు. పైగా అందులో సిగరెట్ తాగుతుంటాడు. ఈ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షాట్ చూస్తే గతంలో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ తప్పకుండా గుర్తుకు వస్తుంది. సర్ధార్ గబ్బర్ సింగ్ టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ లోనూ పవన్ కల్యాణ్ ఇలాగే గుర్రాన్ని చేతిలో పట్టుకుని ఖాకీ బట్టల్లో నడుచుకుంటూ వస్తాడు.
Read Also : Dharma Wife Gauthami : లేడీ డాక్టర్ నా భర్త ఒడిలో కూర్చుని రాత్రంతా.. హీరో ధర్మ భార్య ఆరోపణలు
ఆ సీన్ అప్పట్లో ఓ సెన్సేషన్. ఇప్పుడు చిరంజీవి కూడా సేమ టైటిల్ గ్లింప్స్ లోనే ఇలా గుర్రాన్ని పట్టుకుని వస్తున్నాడు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్.. ఇరువురిని పోల్చుకుంటున్నారు. తమ్ముడిని చూసే అన్న ఇలా కావాలని షాట్ పెట్టించుకున్నాడేమో అంటున్నారు. కాకపోతే రెండు సినిమాల జానర్లు వేరే. సర్దార్ గబ్బర్ సింగ్ ఫుల్ యాక్షన్ మోడ్ మూవీ. చిరంజీవి సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ జానర్ లో వస్తోంది. రెండింటినీ పోల్చి చూడలేం. కానీ తాజా గ్లింప్స్ లో చిరు వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నాడు. పైగా చాలా స్టైలిష్ గా ఉన్నాడు. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి.
Read Also : Bigg Boss Agnipariksha Promo : ముఖానికి పేడ రాసుకున్న కంటెస్టెంట్.. ఇవేం పనులురా బాబు..