రీ రిలీజ్లో సనమ్ తేరీ కసమ్ ఊహించని హిట్ అందుకోవడంతో ఆ హోప్‌తో నెక్ట్స్ కూడా రొమాంటిక్ ఫిల్మ్ రెడీ చేస్తన్నాడు హర్షవర్థణ్ రాణే. కర్ణాటకలో అనుష్క ఘాటీని రిలీజ్ చేసే బాధ్యతను తీసుకున్నారు రాకీ భాయ్ మదర్. ఖైదీ2 మరింత వాయిదా పడుతున్న నేపథ్యంలో కార్తీ మరో దర్శకుడ్ని లైన్లో పెట్టాడు. వీటి ఫుల్ డిటైల్స్ మీకోసం…
Tollywood : అనుష్క- క్రిష్ జాగర్లమూడి కాంబోలో తెరకెక్కుతోన్న ఫిల్మ్ ఘాటీ. విక్రమ్ ప్రభు కీ రోల్ ప్లే చేస్తున్నాడు. సెప్టెంబర్ 5న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఈ ఫిల్మ్ కర్ణాటక రైట్స్ ను కేజీఎఫ్ హీరో యశ్ మదర్ పుష్ప అరుణ్ కుమార్ దక్కించుకున్నారు. పా ఫిల్మ్స్ బ్యానర్‌పై కన్నడలో రిలీజ్ చేస్తున్నారు.
Bollywood : ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో రాణిస్తున్న యాక్టర్ హర్ష వర్థన్ రాణే. కానీ ఇక్కడ కంటే బీటౌన్‌లో హీరోగా క్లిక్ కావడంతో.. అదే ప్లోని కంటిన్యూ చేస్తున్నాడు. సనమ్ తేరీ కసమ్ రీ రిలీజ్ మంచి రెస్పాండ్ రావడంతో.. నెక్ట్స్ ఇదే జోనర్‌లో ఏక్ దివానీ కి దివానీయా మూవీని చేస్తున్నాడు. రీసెంట్లీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. సోనమ్ బజ్వా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ రొమాంటిక్ ఫిల్మ్ అక్టోబర్ 21న రిలీజ్ కానుంది.
Kollywood : కూలీ తర్వాత టోటల్ ప్లాన్ ఛేంజ్ చేశాడు లోకేశ్ కనగరాజ్. కార్తీతో ఖైదీ 2 ఉంటుందని చెబుతున్న దర్శకుడు. ఇప్పుడు రజనీకాంత్ కమల్ హాసన్ తో కలిసి మల్టీస్టారర్ ప్లాన్ చేస్తుండటంతో పాటు హీరోగానూ ప్రయత్నాలు చేస్తున్నాడు. దీంతో డిసెంబర్ నుండి లోకీ కోసం కార్తీ కేటాయించిన కాల్షీట్స్ సుందర్ సి కోసం ఇచ్చాడని సమాచారం.