Maa Inti Bangaram: ‘మా ఇంటి బంగారం’ కోసం నందిని రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మయోసైటిస్ బారిన పడి, కోరుకున్న సమంత సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటుంది. నిర్మాతగా మారి, శుభం సినిమా చేసిన ఆమె దాంతో కమర్షియల్‌గా బాగానే సంపాదించింది. ఇక ఇప్పుడు ఆమె నుంచి ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని గతంలోనే చాలా కాలం క్రితం ప్రకటించారు. ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నారని అప్పట్లో ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఆ కొత్త దర్శకుడి స్థానంలో సమంత స్నేహితురాలైన దర్శకురాలు నందిని రెడ్డి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది.
Also Read:Coolie : ‘కూలీ’లో పాత్ర అన్యాయం అంటూ ప్రచారం.. స్పందించిన శృతిహాసన్..
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
వీరిద్దరూ కలిసి గతంలో ‘ఓ బేబీ’ లాంటి హిట్ అందుకున్నారు. అయితే, అంతకుముందు చేసిన ‘జబర్దస్త్’ అనే సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతానికి నందిని రెడ్డి ట్రాక్ రికార్డు కూడా అంత పర్ఫెక్ట్‌గా ఏమీ లేదు. మరోపక్క, సమంతది కూడా అదే పరిస్థితి. ఆమె చేస్తున్న సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. నిర్మాతగా మారిన తర్వాత బ్రేక్ తీసుకున్న ఆమె, ఇప్పుడు ఈ సినిమా మొదలుపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా 80లలో సెట్ చేయబడిన ఒక క్రైమ్ త్రిల్లర్ అని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి నందిని రెడ్డి ఎంట్రీ తర్వాత మళ్లీ రీస్క్రిప్ట్ జరుగుతోంది. సమంత తన సొంత ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సినిమాని నిర్మించబోతోంది. ఈ మధ్యకాలంలో ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ, తాను ఇకమీదట ఎక్కువ సినిమాలు కాదు, మంచివి తక్కువ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?