అక్కినేని నాగార్జున తండ్రి నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా సరే, తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. నిజానికి ఈ ఏడాది ఆయన హీరోగా నటించిన సినిమాలు రాలేదు. ‘కుబేర’లో ఒక చిన్న పాత్రతో పాటు ‘కూలీ’లో నెగటివ్ రోల్‌లో ఆయన కనిపించాడు. ఆయన పాత్రలకు ఎంత ప్రశంసలు లభిస్తున్నాయో, అంతే రేంజ్‌లో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే, తెలుగులో మరోసారి కం బ్యాక్ ఇచ్చేలా ఆయన ఒక ప్రాజెక్టు రెడీ చేసుకుంటున్నాడు. మరోపక్క, ఆయన హోస్ట్ చేయబోతున్న ‘బిగ్ బాస్ సీజన్ 9’ కూడా మొదలు కావడానికి రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ‘బిగ్ బాస్ సీజన్ 9’ ప్రారంభం కాబోతోంది.
Also Read : Maa Inti Bangaram: ‘మా ఇంటి బంగారం’ కోసం నందిని రెడ్డి
ఇప్పటికే కామనర్స్ అంటూ 45 మందిని సెలెక్ట్ చేసి, వాళ్లకు ‘అగ్నిపరీక్ష’ పేరుతో ఒక షో కండక్ట్ చేస్తున్నారు. వారిలో ఐదుగురిని సీజన్ 9కి పంపే అవకాశం ఉంది. ఒకపక్క ‘బిగ్ బాస్’తో పాటు, మరోపక్క కొత్త దర్శకుడు కార్తీక్‌తో ఆయన సినిమా ఒకే సమయంలో ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ‘బిగ్ బాస్’ విషయానికి వస్తే, శని, ఆదివారాలలో ఆయన హౌస్ లోపలికి వెళ్లి కంటెస్టెంట్లతో మాట్లాడుతుంటారు. దానికి సంబంధించిన షూటింగ్ అంతా శనివారమే పూర్తి చేస్తారు. ఆదివారం నాగార్జున రెస్ట్ మోడ్‌లో ఉంటారు. వారంలో రెండు రోజులు ‘బిగ్ బాస్’ రెస్ట్‌కి తీసేస్తే, మరో ఐదు రోజులలో ఈ సినిమా షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. వారానికి ఒక రోజు మాత్రమే రెస్ట్ తీసుకునేలా ఆయన ఒకపక్క ‘బిగ్ బాస్’, మరోపక్క సినిమాలతో బిజీ కాబోతున్నారు. ‘కూలీ’, ‘కుబేర’ సినిమాల్లో తన పాత్రలకు వచ్చిన విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చేలా తన కం బ్యాక్ సినిమా ఉంటుందని నాగార్జున అభిమానులు భావిస్తున్నారు.