రాక్షసుడు, ఖిలాడీ సినిమాలను తెరకెక్కించిన రమేష్‌వర్మతో ముచ్చటగా మూడో సినిమా చేయనున్నారు నిర్మాత కోనేరు సత్యనారాయణ. రాఘవ లారెన్స్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఎ స్టూడియోస్ ఎల్ ఎల్ పీ, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్ కలిసి ఐ ఓ సినిమా నిర్మిస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. రాఘవ లారెన్స్ సినీ కెరీర్ లో 25వ సినిమాగా రానుంది ఈ చిత్రం. నవంబర్‌లో షూటింగ్‌ను ప్రారంభించి 2025 సమ్మర్లో విడుదల చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. Also…
ఢీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ లో అడుగుపెట్టిన జానీ మాస్టర్ అనంతికాలంలోనే స్టార్ హీరోలకు డాన్స్ కొరియోగ్రఫీ చేసే రేంజ్ ఎదిగాడు జానీ మాస్టర్. ఇటీవల కేంద ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డ్ అందుకున్నాడు జానీ మాస్టర్. కెరీర్ ఇలా పీక్ స్టేజ్ లో సాగుతూ ఉండగా జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేసాడని ఓ మహిళ లైంగిక వేదింపుల కేసు పెట్టింది. మహిళ ఫిర్యాదు మేరకు…
Saripodhaa Sanivaaram: దర్శకుడు వివేక్ ఆత్రేయ, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో వచ్చిన ‘సరిపోదా శనివారం’ రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఆనందం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మార్క్‌ను బద్దలు కొట్టి గొప్ప బాక్సాఫీస్ మైలురాయిని సాధించింది. ఈ చిత్రం అన్ని చోట్లా విజయవంతంగా దూసుకుపోతూనే ఉంది. మూడవ వారాంతంలో కూడా థియేటర్లలో తన హవాను కొనసాగిస్తోంది. నాని మరో అద్భుతమైన నటనతో…
కిరోసిన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు ఇప్పుడు ‘కళింగ’తో హిట్టు కొట్టారు. దర్శకుడిగా, హీరోగా కళింగ సినిమాతో అందరినీ ఆకట్టుకున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.
టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాశ్ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. తన ప్రియుడు సాయివిష్ణును పెళ్లాడారు. ఆదివారం ఉదయం చెన్నైలోని ఓ ప్రముఖ ఫంక్షన్హాల్లో వీరి వివాహం జరిగింది.
1 – దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 22 న నిర్వహించబోతున్నారు మేకర్స్. హైదరాబాద్ లో HICC నోవాటెల్ లో ఈ వేడుక జరగనుంది 2 – నితిన్, వెంకీ కుడుములు కలయికలో వస్తున్న రాబిన్ హుడ్ టీమ్ ఆస్ట్రేలియా బయలుదేరింది. 13 రోజుల పాటు అక్కడ ఒక సాంగ్ , సీన్స్ షూట్ చేయబోతున్నారు. 3 – స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ లేటెస్ట్ సినిమా ‘తెలుసు కదా’ మొదటి షెడ్యూల్…
శ్రీసింహా, సత్య, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన చిత్రం మత్తువదలరా 2. మత్తువదలరాకు సిక్వెల్ గా వచ్చినా ఈ సినిమాకు రితేష్ రాణా దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 13న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. శ్రీ సింహ కోడూరి మరియు సత్య, వెన్నెల కిశోర్ కామెడీకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పుకుంటూ థాంక్స్ మీట్ నిర్వహించారు మేకర్. ఈ సినిమాను…
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు. అతని గత సినిమాలు కమర్షియల్ హిట్లుగా మారడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందాయి. దుబాయ్‌లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2024లో నాని సినెమాలు సంచలనం సృష్టించాయి. దసరా మరియు హాయ్ నాన్న సినిమాలు మొత్తం తొమ్మిది అవార్డులు గెలుచుకున్నాయి. దసరాలో నాని అద్భుత నటనకు గాను అతనికి ఉత్తమ నటుడు (తెలుగు) అవార్డును తెచ్చిపెట్టింది. కీర్తి సురేష్‌కి ఉత్తమ నటి, శ్రీకాంత్ ఒదెలకి…
తమిళ స్టార్ హీరో విజయ్ త్వరలో చిత్ర పరిశ్రమనుండి తప్పుకోనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదిలోగా పూర్తి స్థాయి రాజాకీయాలలోకి దిగనున్నాడు విజయ్. ఈ నేపథ్యంలో సినీకెరీర్ లో చివరి సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. విజయ్ కెరీర్ లో 69వ గా రానుంది. ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే…
దుబాయ్ లో ఘనంగా జరిగిన సైమా అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ అవార్డ్ అందుకున్నా యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ. “బేబి” సినిమాలో ఆయన హార్ట్ టచింగ్ పర్ ఫార్మెన్స్ కు సైమా అవార్డ్ సొంతమైంది. హీరో రానా చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకున్నారు ఆనంద్ దేవరకొండ. Also Read : 3Movie4K : ఇదెక్కడి క్రేజ్ రా.. ధనుష్ ‘3’ మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే.? ఈ సందర్భంగా హీరో ఆనంద్ దేవరకొండ…