ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన పుష్ప ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పుష్ప సినిమాకి కొనసాగింపుగా వస్తున్న పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. అటు బన్నీ అభిమానులు ఇటు సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు. ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డిలే కారణంగా డిసెంబర్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read : Sankranthi 2025 : సీనియర్ హీరోలకు పోటీగా.. సంక్రాంతి బరిలో యంగ్ హీరో..
తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వెలువడింది. ఇప్పటివరకు ఫస్టాఫ్ వర్క్ పూర్తవ్వగా.. సెకండాఫ్ మూవీ షూటింగ్ దశలో ఉందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతోంది. పుష్ప 2 సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయట. జాతర పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తోందని ఎప్పటి నుంచో టాలీవుడ్ సిర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. కానీ, ఈ పాటను లిరికల్ సాంగ్ రిలీజ్ చేయకుండా మాత్రం నేరుగా థియేటర్లలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది యూనిట్. ఈ పాటకు థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అని టాక్. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ చివరి నాటికి పూర్తి కానుందని సమాచారం. పుష్ప-2లో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీమేకర్స్ నిర్మించే ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా పుష్ప -2 డిసెంబర్ 6వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.