టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భీమ్లా న్యాక్ విడుదల విసాయంలో ఆయన పోరాడిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఆయన ప్రస్తుతం డీజే టిల్లు చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ట్రైలర్ ని నిన్న లాంచ్ చేసిన విషయం విదితమే. ఈ వేడుకలో నాగవంశి చేసిన పలు వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఆయన ఆటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్…
టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు సూర్యదేవర నాగవంశీ. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై హిట్ సినిమాలను నిర్మించి ప్రేక్షకుల హృదయాలలో స్తానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం సూర్యదేవర నాగవంశీ చేతిలో సుమారు నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి భీమ్లా నాయక్. ఈ సినిమాను రిలీజ్ చేయడానికి నాగవంశీ ఎంతగానో ప్రయత్నించారు. ఎవరు ఆపినా ‘భీమ్లా నాయక్’ ఆగదని, తమ సినిమాపై తమకు నమ్మకం ఉందంటూ చెప్పిన నాగవంశీ.. పవన్ కళ్యాణ్ చెప్పడంతో…
చిత్ర పరిశ్రమలో సినిమా టికెట్ రేట్స్ ఇష్యూ అంతకంతకు పెద్దదిగా మారుతోంది. ఒకరిని అన్నారని మరొకరు… వేరే వాళ్ళు తమని అన్నారని ఇంకొకరు మాటల యుద్ధం చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ విషయమై మంచు మోహన్ బాబు స్పందించిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు.. నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదని, అస్సలు నిర్మాతల మధ్య ఐక్యత లేదని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తాజాగా మోహన్ బాబు వ్యాఖ్యలపై…
తెలుగు చిత్రసీమలో సి.కళ్యాణ్ అందరికీ తలలో నాలుకలా ఉంటారు. అందరివాడు అనిపించుకుంటారు. అందరితోనూ కలసి పోతుంటారు. సినిమా రంగంలో ఏ సమస్య వచ్చినా, అందుకు తగ్గ పరిష్కారం కోసం సినీపెద్దలతో చర్చించడంలోనూ, ప్రభుత్వాలతో మంతనాలు జరపడంలోనూ ముందుంటారు. ఒకప్పుడు చిన్న సినిమాల నిర్మాతగా పయనం మొదలుపెట్టి, నేడు అగ్రకథానాయకులతోనూ చిత్రాలు నిర్మించే స్థాయికి చేరుకున్నారు సి.కళ్యాణ్. తెలుగు సినిమా రంగంలో పలు శాఖల్లో అధ్యక్షునిగా పనిచేసిన సి.కళ్యాణ్, ఒకప్పుడు ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్ గానూ సేవలు…
‘ఈ తరం పిక్చర్స్’ అధినేత పోకూరి బాబూరావు చిత్రాలను గుర్తు చేసుకుంటే, ఆయన అభిరుచి ఏమిటో ఇట్టే అర్థమై పోతుంది. ఆయన సినిమాల్లో అభ్యుదయ భావాలు దర్శనమిస్తాయి. సామాన్యుల పక్షం నిలచి, తన సినిమాల ద్వారా వారిలో ధైర్యం నింపిన పోకూరి బాబూరావు నైజం ఆకర్షిస్తుంది. కమర్షియల్ ఫార్ములా మిస్ కాకుండానే తన అభిరుచికి తగ్గ చిత్రాలతో పోకూరి బాబూరావు జనాన్ని ఆకట్టుకున్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలుకు సమీపంలోని త్రోవగుంట పోకూరి బాబూరావు స్వస్థలం. 1950 డిసెంబర్…
సినిమా రంగాన్ని నమ్ముకుంటే తప్పకుండా ఆ తల్లి ఆదరిస్తుంది అంటూ ఉంటారు. చిత్రసీమలో విజయం సాధించిన వారందరి మాటా ఇదే! ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ సైతం అదే మాటను పలుకుతూ ఉంటారు. చిత్రసీమలో అడుగు పెట్టి, ఒక్కో మెట్టూ ఎక్కుతూ, చివరకు నిర్మాతల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు బెల్లంకొండ సురేశ్. ఆయన తనయుడు సాయి శ్రీనివాస్ నవతరం హీరోల్లో ఒకరిగా సాగుతున్నారు. బెల్లంకొండ సురేశ్ 1965 డిసెంబర్ 5న గుంటూరు జిల్లాలో జన్మించారు.…
టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. శివశంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతినే జీర్ణించుకోలేకపోతున్న టాలీవుడ్ ని ఇంకా తీవ్ర విషాదంలోకి నెడుతూ ప్రముఖ నిర్మాత జక్కుల నాగేశ్వరరావు (46) రోడ్డు ప్రమాదంలో మరణించారు. ‘లవ్ జర్నీ’, ‘అమ్మా నాన్న ఊరెళితే’, ‘వీడు సరైనోడు’ లాంటి చిత్రాలను తెలుగులో విడుదల చేసిన నిర్మాత జక్కుల నాగేశ్వరరావు కృష్ణా జిల్లా ఉయ్యురు మండలం మంటాడలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన సంఘటనా స్థలంలోనే మృతిచెందినట్లు తెలుస్తోంది.…