టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు సూర్యదేవర నాగవంశీ. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై హిట్ సినిమాలను నిర్మించి ప్రేక్షకుల హృదయాలలో స్తానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం సూర్యదేవర నాగవంశీ చేతిలో సుమారు నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి భీమ్లా నాయక్. ఈ సినిమాను రిలీజ్ చేయడానికి నాగవంశీ ఎంతగానో ప్రయత్నించారు. ఎవరు ఆపినా ‘భీమ్లా నాయక్’ ఆగదని, తమ సినిమాపై తమకు నమ్మకం ఉందంటూ చెప్పిన నాగవంశీ.. పవన్ కళ్యాణ్ చెప్పడంతో కొద్దిగా వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. ఇక అంతేకాకుండా ఏపీలో టికెట్స్ రేట్స్ ఇష్యూ నడుస్తున్న కారణంగా కూడా ఈ సినిమాను వాయిదా వేసినట్లు తెలిసిందే. అయితే ఇటీవల ఈ సినిమా విడుదలపై కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే మేకర్స్ రెండు రిలీజ్ డేట్స్ ఇచ్చారు. ఫిబ్రవరి 25 కానీ, ఏప్రిల్ 1 కానీ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు.
తాజాగా మరోసారి ఈ ‘భీమ్లా నాయక్’ విషయంపై నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. నేడు డీజే టిల్లు ట్రైలర్ రిలీజ్ వేడుకలో ఆయనకు ఇదే ప్రశ్న ఎదురవ్వగా కొద్దిగా అసహనం వ్యక్తం చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ‘భీమ్లా నాయక్’ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని రిపోర్టర్ అడగగా.. ‘చెప్పాం కదండీ.. రెండు డేట్స్ ఇచ్చాం కదా.. ఇంకా చెప్పాలంటే ‘భీమ్లా నాయక్’ విడుదల సీఎం జగన్ గారి చేతిలో ఉంది. ఆయన థియేటర్లలో 50% ఆక్యుపెన్సీ ఎప్పుడు తీసేస్తే అప్పుడే రిలీజ్ చేస్తాం అంటూ చెప్పారు. ప్రస్తుతం నాగవంశీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.