‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ – దర్శకుడు కొరటాల కాంబోలో మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తిచేసుకొని తారక్ ఉండగా.. కొరటాల ఆచార్య విడుదల కోసం వెయిట్ చేస్తున్నాడు. అయితే తారక్-కొరటాల సినిమా అనౌన్స్ మెంట్ వచ్చి చాలాకాలమే అవుతున్న మిగితా అప్డేట్స్ ఏమి రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశగా ఉన్నారు. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. అయితే ఈ షూటింగ్ కు సంబంధించి తారక్, దర్శకుడు కొరటాల ఓ టాస్క్ ఇచ్చాడట..
పర్ఫెక్ట్ ప్లాన్ తో ఈ సినిమాని ఆరునెలల్లో పూర్తిచేయాలని తారక్ కండిషన్ పెట్టాడట. దీనికోసం తారక్ రోజులో ఎక్కువ సమయం సెట్స్ లోనే గడపడానికి సిద్ధంగా వున్నాడట. సామాజిక అంశాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించే ఈ దర్శకుడు సీన్స్ లో పర్ఫెక్షన్ కోసం కాస్త ఎక్కువ సమయం తీసుకుంటాడనే పేరుంది. మరి ఎన్టీఆర్ ఇచ్చిన టాస్క్ కు కొరటాల ఏంచేస్తాడనేది చూడాలి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మూవీకి ‘డైమండ్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట.. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మించనున్నారు.