పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా రూపొందుతున్న చిత్రం భీమ్లా నాయక్.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పవన్ & టైటిల్ గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ రాగా, విడుదలైన మొదటి పాట కూడా రికార్డ్స్ సాధించింది. ఇక అందరు రానా అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తుండగా.. తాజాగా ఆయనకు సంబందించిన అప్డేట్ ప్రకటించింది చిత్రబృందం.
‘బ్లిట్జ్ ఆఫ్ డానియెల్ శేఖర్’ ప్రోమోను ఈనెల 20న విడుదల చేయబోతున్నట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో రానా వెనకవైపు నుంచి కనిపిస్తోండగా.. పంచె లేపి ప్రత్యర్థి భీమ్లా నాయక్ తో యుద్దానికి సై అన్నట్లుగా పోస్టర్ బట్టి చూపించాడు దర్శకుడు సాగర్ కే చంద్ర. ఇక ఈ సినిమాకి త్రివిక్రమ్ పర్యవేక్షణతో పాటుగా, మాటలు కూడా అందిస్తున్నారు. పవన్ సరసన నిత్యామీనన్, రానా జంటగా ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
కాగా, భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించి రానాకు సంబంధించిన ఏ అప్డేట్, పోస్టర్, ఇవ్వలేదని రానా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మల్టీస్టారర్ సినిమా అయినప్పటికీ భీమ్లా నాయక్ అంటే కేవలం పవన్ కల్యాణ్ సినిమా మాత్రమే అనేలా ప్రమోషన్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో దర్శకుడు, భీమ్లా నాయక్ ప్రత్యర్థి డానియెల్ శేఖర్ అప్డేట్ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.