Samantha:స్టార్ హీరోయిన్ సమంత ఒక ఏడాది నుంచి రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. మయోసైటిస్ వ్యాధితో చికిత్స తీసుకుంటున్న సమంత.. దాంతో పాటు మానసిక ప్రశాంతత కోసం షూటింగ్స్ కు ఒక ఏడాది ఫుల్ స్టాప్ పెట్టింది.
Manchu Vishnu: తెలుగు సినిమా పరిశ్రమ 90 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గతంలో వజ్రోత్సవం చేసినట్టు ఈసారి 'నవతిహి ఉత్సవం' చేయబోతున్నారు. త్వరలో మలేషియాలో నవతిహి పేరిట చేయబోయే ఈ చారిత్రాత్మక ఈవెంట్ గురించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు.. హైదరాబాద్ పార్క్ హయత్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.
Varalaxmi Sarathkumar: తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదట హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టినా కూడా తనకు హీరోయిన్ పాత్రలు సూట్ కావని విలనిజాన్ని ఎంచుకుంది. ఇప్పుడున్న ఇండస్ట్రీలో కుర్ర లేడీ విలన్ గా అమ్మడు ఒక గుర్తింపును తెచ్చుకుంది.
బాలీవుడ్ వివాదాస్పద దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు అనురాగ్ కశ్యప్. ఎలాంటి విషయం అయినా ఆయన మాట్లాడితే వివాదం అవ్వాల్సిందే. ఇక ఈయనపై ఎంతోమంది హీరోయిన్లు లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా చేశారు. అయినా ఆధారాలు లేకపోవడంతో అవన్నీ వట్టి మాటలే అని కొట్టిపారేశాడు. ప్రస్తుతం ఒకపక్క డైరెక్టర్ గా, నటుడిగా బిజీగా ఉన్న అనురాగ్.. సోషల్ మీడియాలో ఒక వైరల్ పోస్ట్ ను షేర్ చేశాడు.
R Narayana Murthy: మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మనసు వెన్న అని అందరికి తెల్సిందే. ఆమె మంచి మనస్సు తెలిసినవారు ఎవరు కూడా ఆమె గురుంచి నెగెటివ్ గా మాట్లాడారు. సావిత్రికి ఎంత మంచి మనసు ఉందో .. అంతే పంతం కూడా. ఒకరకంగా చెప్పాలంటే మొండితనం ఎక్కువ.
Eerojullo Re Release: ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే స్టార్ హీరోల హిట్ సినిమాలు మళ్లీ రిలీజ్ అయ్యి హిట్స్ అందుకున్నాయి. ఇక ఆ కోవలోనే 2012, మార్చి 23న విడుదలై యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా కుర్రకారుని ఆకట్టుకుని సంచలన విజయం సాధించిన ఈ రోజుల్లో చిత్రాన్ని రీరిలీజ్ కు సిద్ధం చేశారు మేకర్స్.
Ayesha Khan: సినిమా ఇండస్ట్రీ ఎవరిని ఎప్పుడు అందలం ఎక్కిస్తుందో.. ఎవరిని ఎప్పుడు అధఃపాతాళానికి తొక్కేస్తుందో ఎవరికి తెలియదు. అందుకే ఇండస్ట్రీలో వారందరూ గ్లామర్ ఉన్నప్పుడే వరుస అవకాశాలను అందుకొని నాలుగురాళ్లు వెనకేసుకుంటున్నారు. ఇక గత కొంతకాలంగా హిట్ అయిన సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్లు మాత్రమే కాదు, స్పెషల్ సాంగ్స్ చేసిన హీరోయిన్లు, నెగెటివ్ రోల్స్ చేసిన హీరోయిన్లను కూడా క్రష్ లా మార్చేసుకుంటున్నారు.
RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత చరణ్ నటిస్తున్న చిత్రం RC16. ఉప్పెన చిత్రంతో నేషనల్ అవార్డును అందుకున్న బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. విజయాపజయాలను పట్టించుకోకుండా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరో, కుర్ర హీరో అని తేడా లేకుండా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. కానీ, చై మాత్రం ఇంకా ఒకేలాంటి సినిమాలు చేస్తున్నాడు అనేది అక్కినేని ఫ్యాన్స్ మాట.
Sridevi Vijay Kumar: ఈశ్వర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన అందం శ్రీదేవి. నటుడు విజయ్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. మొదటి సినిమాతో కుర్రాళ్ళ గుండెలను కొల్లగొట్టింది. ఇక కుర్ర హీరోల సరసన నటించి మెప్పించిన శ్రీదేవి.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. 2009లో రాహుల్ అనే వ్యక్తిని వివాహమాడిన శ్రీదేవి అనంతరం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.