Hardik Pandya Stats: బిగ్ మ్యాచ్‌లలో బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్.. ఐసీసీ నాకౌట్‌లలో ఆహా అనిపిస్తున్న హార్దిక్ గణాంకాలు!
- భారత విజయాల్లో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర
- టీమిండియా పెద్ద మ్యాచ్ విన్నర్ హార్దిక్
- ఆహా అనిపిస్తున్న హార్దిక్ గణాంకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya ICC Knockout Stats: భారత క్రికెట్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల నాకౌట్ మ్యాచ్‌లలో అతడి ప్రదర్శన జట్టుకు కీలక విజయాలను అందిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ కీలక సమయాల్లో రాణిస్తూ.. టీమిండియాకు పెద్ద మ్యాచ్ విన్నర్‌గా హార్దిక్ నిలుస్తున్నాడు. అందుకే ప్రపంచ క్రికెట్‌లో అతడికి ప్రత్యామ్నాయం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో హార్దిక్ అద్భుత రికార్డు ఎలా ఉందొ తెలుసుకుందాం.
తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్‌పై హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో 18 పరుగులు చేసి జట్టు స్కోరును పెంచాడు. బౌలింగ్‌లో కూడా ఒక వికెట్ తీసి తన వంతు పాత్ర పోషించాడు. ఇదే టోర్నీలో సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై 12 బంతుల్లో 27 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ అందించాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశాడు.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్‌సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
- BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో హార్దిక్ పాండ్యా కీలక మ్యాచ్‌లలో రాణించాడు. ఫైనల్లో న్యూజిలాండ్‌పై 18 పరుగులు చేసి.. బౌలింగ్‌లో 30 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 23 బంతుల్లో 28 పరుగులు చేసి ఒక వికెట్ పడగొట్టాడు. ఇలా పెద్ద మ్యాచ్‌లలో ఒత్తిడిని తట్టుకుని జట్టుకు సహాయపడటం పాండ్యా ప్రత్యేకతగా నిలిచింది.
Also Read: Sanju Samson History: టీ20 ప్రపంచ కప్ హిస్టరీలో సంజు నయా చరిత్ర.. హేమాహేమీలకు కూడా సాధ్యం కాలే!
టీ20 ప్రపంచకప్ 2024లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో పాండ్యా 2 బంతుల్లో 5 పరుగులు చేసి, బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. అదే టోర్నీలో సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై 13 బంతుల్లో 23 పరుగులు చేసి.. రెండు వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై 33 బంతుల్లో 63 పరుగులు బాదాడు. అంతకుముందు 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై 62 బంతుల్లో 32 పరుగులు చేసి ఒక వికెట్ కూడా తీసాడు. ఇక 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్‌పై 43 బంతుల్లో 76 పరుగులు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.
ఈ గణాంకాలను పరిశీలిస్తే.. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో హార్దిక్ పాండ్యా ఎప్పుడూ జట్టుకు కీలకంగా నిలుస్తున్నాడు. ఒత్తిడి పరిస్థితుల్లోనూ ధైర్యంగా ఆడుతూ.. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ ప్రభావం చూపుతున్నాడు. అందుకే బిగ్ మ్యాచ్‌లలో భారత్‌కు హార్దిక్ వంటి మ్యాచ్ విన్నర్ ఎంతో అవసరమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. భారత జట్టుకు అతడు ఒక కీలక ఆయుధంగా మారాడు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్‌సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!