JR NTR – Vijay Devarakonda : ఏ సినిమా హీరో అయినా ఓవర్ హైప్ ఇస్తే భారీ నష్టమే జరుగుతుంది. రూపాయి విలువ చేసే వస్తువుకు రూపాయి వరకే చెప్పాలి. కానీ దాని స్థాయికి మించి చెప్తే జనాలు ఓ స్థాయిలోనే ఓవర్ హైప్ తో వెళ్తారు. అప్పుడు రూపాయి విలువ కు మించి దాని స్థాయి ఉండదు కాబట్టి అది ప్లాప్ అవుతుంది. ఇప్పుడు సినిమాల విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఒక సినిమా ఏ స్థాయి వరకు ఆడుతుందో దాంట్లో నటించిన హీరోలకు, డైరెక్టర్లు, నిర్మాతలకు తెలుసు. సినిమా రెడీ అయిపోయాక వాళ్లందరూ కచ్చితంగా ఫైనల్ ప్రింట్ చూస్తారు. అది ఏ స్థాయి సినిమానో వాళ్లకు తెలుసిపోతుంది. ఆ స్థాయి వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్లలో వాళ్లు మాట్లాడితే బెటర్. అంతకు మించి ఊపేస్తా, కాల్చేస్తా అంటే ఫ్యాన్స్ కూడా ఆ స్థాయిలోనే అంచనాలు పెట్టేసుకుని మూవీకి వెళ్తారు.
Read Also : Chiranjeevi : చిరంజీవి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ రోజే టీజర్..
దాంతో సినిమా బాగున్నా సరే వాళ్లు ఊహించుకున్నంత, హీరోలు చెప్పినంత లేదే అనే అసంతృప్తితో మూవీపై నెగెటివ్ టాక్ వచ్చేస్తుంది. అది చిరకు మూవీనే ముంచేస్తుంది. మొన్న విజయ్ దేవరకొండ, నిన్న జూనియర్ ఎన్టీఆర్ విషయాల్లో జరిగింది. ఇదే. కింగ్ డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో చాలా పెద్దోడినైపోతా అన్నట్టు హైప్ ఇచ్చాడు. చివరకు సినిమా చూసిన వాళ్లకు కంటెంట్ నచ్చినా విజయ్ ఇచ్చిన హైప్ కు తగ్గట్టు లేదనే కారణంతో మూవీకి డిజాస్టర్ టాక్ వచ్చింది. ఎన్టీఆర్ కూడా వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ భారీ హైప్ ఇచ్చాడు. బొమ్మ అదిరిపోయింది అంటూ కాలర్ ఎగరేశాడు. అదే అంచనాలతో మూవీకి వెళ్లిన ఫ్యాన్స్ కు ఆశించిన రేంజ్ లో లేదనే డిసప్పాయింట్ వచ్చింది. అందుకే మూవీ బాగున్నా అంచనాలకు తగ్గట్టు లేదనే అసంతృప్తి వల్ల నెగెటివ్ టాక్ వచ్చింది. వాస్తవానికి కింగ్ డమ్, వార్-2 కంటెంట్ పరంగా బాగానే ఉన్నాయి. కానీ హీరోల బడా స్టేట్ మెంట్ల వల్ల ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టేసుకుని థియేటర్లకు వెళ్లి అసంతృప్తికి లోనవుతున్నారు. కాబట్టి ఇలాంటి స్టేట్ మెంట్లు మానుకుని.. సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు అన్న వరకు మాట్లాడితే బెటర్ అంటున్నారు ఫ్యాన్స్.
Read Also : Prabhas-JR NTR-Ram Charan : ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్.. బాలీవుడ్ డ్యామేజ్..