Udaya Bhanu : యాంకర్ గా ఉదయభాను అప్పట్లో బాగా ఫేమస్. కానీ మధ్యలో కనిపించకుండా పోయారు. ఈ నడుమ వరుసగా దుమారం రేపే కామెంట్లు చేస్తున్నారు. యాంకర్లు అందరూ సిండికేట్ అయిపోయారని మొన్న ఓ సినిమా ఈవెంట్ లో మంటలు రేపింది. తాజాగా మరో ఇంటర్వ్యూలో టీవీ షోలపై సంచలన కామెంట్లు చేసింది. మీరు అందరూ అనుకున్నట్టు టీవీ షోలు అన్నీ నిజం కావు. అక్కడ తిట్టుకునేది, కొట్టుకునేది, చివరకు నవ్వుకునేది కూడా అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది. తెలుగులో చాలా రియాల్టీ షోలు ఉన్నాయి. అందులో ఏ ఒక్కటి కూడా నిజం కాదు. షో మధ్యలో ఎక్కడ తిట్టాలో వాళ్లే చెప్తారు. ఎక్కడ నవ్వాలో కూడా వాళ్లే డిసైడ్ చేస్తారు. అంతకు ముందు మైక్ లో చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడు మౌత్ స్పీకర్ లు వచ్చాక అందులోనే చెప్పేస్తున్నారంటూ తెలిపింది ఉదయభాను.
Read Also : Coolie : అమీర్ ఖాన్, నాగార్జునను డామినేట్ చేసిన చిన్న నటుడు..
నేను గతంలో చాలా రియాల్టీ షోలు చేశాను. కానీ అందులో చేసేవి నచ్చక ఎప్పుడో మానేశాను. అక్కడ మనం చేయడానికి ఏమీ ఉండదు. అసలు ఎందుకు ఆ షోలు చేశానా అని ఇప్పటికీ బాధపడుతుంటాను అంటూ చెప్పుకొచ్చింది ఉదయభాను. తనకు చాలా షోలకు కనీసం డబ్బులు కూడా ఇవ్వలేదని తెలిపింది. కొంత మంది ప్రొడ్యూసర్లు చెక్కులు ఇచ్చినా అవి చెక్ బౌన్స్ అయినట్టు తెలిపింది. అలాంటి చెక్కులు తన వద్ద బోలెడన్ని ఉన్నాయని వివరించింది ఉదయభాను. తనను తొక్కేయడానికి ఎంతో మంది ప్రయత్నించారని.. తనను షో మధ్యలో నుంచి తీసేసిన సందర్భాలు చాలా ఉన్నాయని తెలిపింది. సినిమా ఈవెంట్లకు అవకాశాలు ఇచ్చినట్టే ఇచ్చి లాస్ట్ మినిట్ లో తీసేసేవాళ్లని ఎమోషనల్ అయింది ఉదయభాను. త్వరలోనే ఇండస్ట్రీలో తన మీద జరిగిన కుట్రల గురించి బయట పెడుతానంటూ వార్నింగ్ ఇచ్చింది.
Read Also : Coolie : కూలీలో తన రెమ్యునరేషన్ చెప్పిన అమీర్ ఖాన్..