Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో విశ్వంభర భారీ బడ్జెట్ తో వస్తోంది. వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా తీసుకొస్తున్నారు. జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి భారీ అప్డేట్ రాబోతోంది. మూవీ టీజర్ ను ఇప్పటికే కట్ చేసినట్టు తెలుస్తోంది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు ఉంది. ఆ రోజే టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించబోతున్నారు. ఇప్పటికే ఆర్ ఆర్ కూడా కంప్లీట్ అయిపోయిందంట. గతంలో వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ పై కొన్ని విమర్శలు వచ్చాయి. వీఎఫ్ ఎక్స్ వీక్ గా ఉందనే ప్రచారం జరిగింది. అందుకే ఈ సారి ఎలాంటి విమర్శలకు తావు లేకుండా చూస్తున్నారంట.
Read Also : Prabhas-JR NTR-Ram Charan : ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్.. బాలీవుడ్ డ్యామేజ్..
వశిష్ట అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మెగా ఫ్యాన్స్ మెచ్చే విధంగా టీజర్ ను కట్ చేయించినట్టు తెలుస్తోంది. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్లుగా చేస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి పాత కాలం నాటికి వెళ్లే సీన్స్ కూడా ఉంటయాంటున్నారు. వింటేజ్ చిరు లుక్ గురించి ఇప్పటికే చర్చ జరుగుతోంది. కాబట్టి చిరంజీవి లుక్ ఈ సినిమాలో మరింత ఇంట్రెస్ట్ ను పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ టీజర్ తో మెగా ఫ్యాన్స్ ను సంతృప్తి పరిచేసి మూవీపై భారీగా అంచనాలు పెంచాలని చూస్తున్నారు. సెప్టెంబర్ లోనే మూవీ రిలీజ్ అవుతుందనే టాక్ మొన్నటి వరకు నడిచింది. కానీ ఇప్పుడు అక్టోబర్ కు షిఫ్ట్ అయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. చూస్తుంటే ఈ టీజర్ లోనే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also : JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటివి ఆపేస్తే బెటర్..?