ఈ ఏడాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ‘కూలీ’ ఒకటి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 14న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. స్టార్ కాస్ట్ విషయంలోనూ ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తోంది. అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రలు పోషిస్తుండగా, పూజా హెగ్డే ‘మోనికా’ అనే స్పెషల్ సాంగ్‌లో అలరించనున్నారు. ఇప్పటికే ఆ పాట సోషల్ మీడియాలో హాట్ ట్రెండ్‌గా మారింది. ఇక
Also Read : Betting Apps Case : నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న మంచు లక్ష్మి
350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పెద్ద భాగం స్టార్ కాస్ట్ రెమ్యూనరేషన్‌కే వెచ్చించినట్లు సమాచారం. నాగార్జున ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించబోతుండగా, ఆయనకు రూ.10 కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చినట్టు టాక్. ఇక రజినీకాంత్‌కు రూ.150 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అమీర్ ఖాన్ 20 నిమిషాల గెస్ట్ రోల్‌కి రూ.20 కోట్లు, పూజా హెగ్డే ఒక్క పాటకు రూ.3 కోట్లు అందుకున్నారు.అలాగే ఉపేంద్ర, శృతి హాసన్ తలో రూ.4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. ప్రజంట్ ఈ వర్త వైరల్ అవుతుంది.