Kanguva: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉన్నాడు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రెండు రోజుల క్రితమే ఈ సినిమా ఉంచి రిలీజైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలతో.. ఇంకోపక్క సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ దగ్గరపడుతుండటంతో.. సినిమాలకు బ్రేక్ చెప్పి, ప్రచారాలకు ఎక్కువ సమయాన్నీ కేటాయిస్తున్నారు. ఇక ఎప్పటినుంచో అప్డేట్ అడుగుతుంటే.. తరువాత తరువాత అని వెనక్కి తగ్గే హరీష్ శంకర్.. ఈరోజు ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేశాడు.
Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. మయోసైటిస్ వ్యాధి బారి నుంచి ఈ మధ్యనే కోలుకున్న సామ్.. పెండింగ్ ఉన్న తన సినిమాలను కంప్లీట్ చేస్తోంది. ప్రస్తుతం సామ్ నటిస్తున్న చిత్రాల్లో సిటాడెల్ ఒకటి. అమెజాన్ ప్రతిష్టాత్మకంగా ఈ సిరీస్ ను నిర్మిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో పేరు తెచ్చుకున్న రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు.
Gaami: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం గామి. కొత్త దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ సినిమాలో తెలుగు నటి చాందినీ చౌదరి కథానాయికగా నటించింది.
Ghaati: ఎగిరిపోతే ఎంత బావుంటుంది.. ఎగిరిపోతే ఎంత బావుంటుంది.. అంటూ కుర్రకారును తన అందాలతో మెస్మరైజ్ చేసిన సరోజ గుర్తుందా..? డబ్బు కోసం వేరే దారిలేక వేశ్యా వృత్తిలోకి వచ్చి.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, సొంతంగా ఎదగాలనుకొనే అమ్మాయి సరోజ. ఆ ప్రయాణంలో ఆమె ఎన్ని కష్టాలను ఎదుర్కొంది అనేది వేదం సినిమాలో చూపించాడు క్రిష్ జాగర్లమూడి.
Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రీలీల జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పటికే పవన్ - హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇన్నాళ్లకు ఈ కాంబో ఉస్తాద్ తో రాబోతుంది. మొదటి నుంచి ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
Kanguva Sizzle: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి కంగువ. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. తెలుగులో యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేస్తున్న కంగువ త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తోంది.
Ustaad Bhagath Singh:దేశవ్యాప్తంగా ఎన్నికల నగార మోగింది.. ఏపీ ఎలక్షన్స్ హీటెక్కిపోతుంది.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలారోజులుగా ఆంధ్రప్రదేశ్ లోనే పర్యటిస్తూ.. సభలు ఏర్పాటు చేస్తూ.. పూర్తిగా తన పొలిటికల్ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. దీంతో ఆయన అప్ కమింగ్ సినిమాలకు బ్రేక్ పడినట్టే అనుకున్నారంతా.
Director Krish: క్రిష్ జాగర్లమూడి.. ఈ పేరు ఈ మధ్య వార్తల్లో బాగా నానిన విషయం తెల్సిందే. ర్యాడిసన్ బ్లూ హోటల్ లో జరిగిన డ్రగ్స్ రైడ్ లో క్రిష్ పేరు కూడా రావడంతో.. ఆయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఇప్పుడంటే సినిమాల విషయంలో కొద్దిగా వెనక్కి తగ్గాడు కానీ, ఒకప్పుడు క్రిష్ తీసిన సినిమాలు అన్ని అవార్డు విన్నింగ్ సినిమాలే.
Jayamailini: అలనాటి అందాల తార సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చేసిన సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. నిజం చెప్పాలంటే.. సిల్క్ జీవితం ఒక పువ్వు లాంటిది. అందు ఆ పువ్వుని చూసారు కానీ, దానికింద ఉన్న ముళ్ళును మాత్రం ఎవరు చూడలేకపోయారు. ఆ ముళ్ళమీద నడుస్తూనే ఆమె చిరునవ్వులు చిందించింది.