Coolie : రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. లోకేష్ డైరెక్షన్ కావడంతో పాటు నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్లు ఉండటంతో వాళ్ల పాత్రలు ఓ రేంజ్ లో ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ ఇంత పెద్ద స్టార్ల కంటే ఓ కమెడియన్ బాగా హైలెట్ అయిపోయాడు. కూలీ చూసిన వారంతా అతని నటనకు ఫిదా అయిపోతున్నారు. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్రల కంటే అతని పాత్రకే బాగా స్కోప్ దక్కింది. చాలా వేరియేషన్స్ ఉన్న పాత్ర. అతనే సౌబిన్ సాహిర్. మంజుమ్మల్ బాయ్స్ సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయం అయ్యాడు. చిన్న సినిమాలతో కెరీర్ మొదలు పెట్టి స్టార్ యాక్టర్ గా మారాడు. మలయాళంలో పెద్ద హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ చివరకు కూలీ మూవీలో విలన్ పాత్రను దక్కించుకున్నాడు.
Read Also : Coolie : కూలీలో తన రెమ్యునరేషన్ చెప్పిన అమీర్ ఖాన్..
ఈ సినిమా కోసం ఎన్నో ఆఫర్లు రిజెక్ట్ చేశాడు. కొన్ని నెలల పాటు డేట్లు ఇచ్చేశాడు. చివరకు సినిమా రిలీజ్ అయ్యాక అతనికి మంచి బ్రేక్ దక్కింది. ఈ సినిమాలో అతని పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. ఒకానొక దశలో నాగార్జున కంటే ఎక్కువ విలనిజం చూపించింది ఇతనే. నాగార్జున కంటే మనోడు మొదటి నుంచి క్రూరమైన విలన్ గా కనిపించి మెప్పించాడు. క్రూరత్వం నింపుకున్న మనిషిగా అతని నటన అమోఘం. బురద పూసుకుని అతను నటించిన తీరు మామూలు విషయం కాదు. ఇలాంటి ఎక్స్ ప్రెషన్లు పలికిస్తూనే పాత్రలోని వేరియేషన్స్ ను థియేటర్లలో తన నటనతో పేలిపోయేలా చేశాడు. అందుకే అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర కంటే ఇతని గురించే ప్రేక్షకులు ఎక్కువ తెలుసుకుంటున్నారు. మొత్తానికి పెద్ద స్టార్లకు మించి ఇతని పాత్రకు గుర్తింపు రావడం అంటే అది తన ట్యాలెంట్ కు దక్కిన ఫలితమే.
Read Also : JR NTR – Vijay Devarakonda : జూనియర్ ఎన్టీఆర్, విజయ్ లకు వాటితో భారీ దెబ్బ..!