బిగ్ బాస్ విన్నర్ గా ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయాడు విజె సన్నీ. ట్రోఫీ గెలిచి బయటకు వచ్చాకా సన్నీ ప్రెస్ మీట్లతో పాటు ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న సన్నీ తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నాడు. తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్న సన్నీ మొక్కలు నాటాడు. అనంతరం తన ముగ్గురు స్నేహితులైన షన్ను, సిరి, శ్రీరామ చంద్రకు ఈ ఛాలెంజ్ ని విసిరారు. అంతేకాకుండా…
సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూ.ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 7 న విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ముంబైలో ఫుల్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు హీరోలు. ఇప్పటికే ముంబైలో ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ త్రయమే కనిపిస్తున్నారు అనడంలో సందేహం లేదు. ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అంటూ బిజీగా ఉన్న స్టార్ హీరోలు తాజాగా కపిల్ శర్మ షో లో సందడి…
బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ. ఎంట్రీ ఇచ్చినపుడు సన్నీ టాప్ 5 వరకూ చేరుకుంటాడని గానీ, టైటిల్ గెలుస్తాడని గానీ ఎవరూ ఊహించలేదు. అయితే తన ఆటతీరుతో పాటు సోషల్ మీడియా మేనేజ్ మెంట్ తో వారం వారానికి స్ట్రాంగ్ అవుతూ టాప్ 5 చేరుకోవడమే కాదు ఏకంగా టైటిల్ కూడా ఎగరేసుకుపోయాడు. జర్నలిస్ట్ గా కెరీర్ ఆరంభించి మోడల్ గా, టీవీ యాక్టర్ గా మారి సినిమాలోనూ మెయిన్ లీడ్ చేసిన సన్నీకి…
బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న చిత్రం రాధేశ్యామ్. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 14న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుచ్న్హి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులకు భారీ అంచనాలను నెలకొల్పాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ప్రమోషన్స్ లో భాగంగా నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరగనుంది. ఈ ఈవెంట్ కి అభిమానులే ముఖ్య…
‘పుష్ప’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది రష్మిక మందన్నా. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఇంట్లో పూజలు చేయించింది. అయితే ఈ పూజలకు కారణం ఏంటీ అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. చిత్ర పరిశ్రమలో వివాదాల స్వామిగా పేరుతెచ్చుకున్న వేణు స్వామి ఈ పూజలు చేయించినట్లు తెలుస్తోంది. వేణుస్వామి.. సమంత – నాగ చైతన్య విడాకులు అవుతాయని సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారిన…
బిగ్ బిన్ సీజన్ 5 ముగిసింది. విజె సన్నీ విన్నర్ గా నిలువగా షణ్ముఖ్ రన్నర్ గా మిగిలాడు. ఇక బిగ్ బాస్ లో ఏది జరిగినా అదంతా అక్కడివరకే అని, బయటికొచ్చాకా తమ ప్రపంచం తమదని కంటెస్టెంట్లు చెప్పుకొచ్చారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ వలన ఒక ప్రేమ జంట విడిపోయే పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. బిగ్ బాస్ కి వెళ్లకముందే షణ్ముఖ్- దీప్తి సునయన తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడానికి…
హీరో సిద్దార్థ్ .. ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమ్రోగుతున్న పేరు. మొదటి నుంచి సిద్దార్థ్ ఏ విషయమైనా నిస్సంకోచంగా తన మనుసులో ఉన్న మాటను చెప్పే స్వభావం కలవాడు. సామాజిక అంశాల మీద.. ప్రభుత్వ విధానాలు వైఫల్యాల మీద.. సినీ ఇండస్ట్రీ గురించి తనదైన రీతిలో ట్విట్టర్ లో ఏకిపారేస్తాడు. ఇక ఇటీవల సమంత- నాగ చైతన్య విడాకుల సమయంలో సిద్దు వేసిన ట్వీట్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ట్వీట్…
పవన్ కల్యాణ్ మరోసారి దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడట. అభిమానులు పవన్ ను దేవుడిగా భావిస్తుంటారు. వారే కాదు కొంత మంది దర్శకనిర్మాతలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఇక వెండితెర మీద కూడా పవన్ దేవుడి పాత్రలో అలరించారు. ‘గోపాల గోపాల’ సినిమాలో అభినవ కృష్ణుడిగా అలరించారు పవన్. చేసింది కృష్ణుడి పాత్ర అయినా మనిషి రూపంలోనే కనిపించి కనువిందు చేశాడు. ఆ పాత్రను ప్రేక్షకులు చక్కగా రిసీవ్ చేసుకున్నారు. పవన్ క్రేజ్…
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5కి తెరపడింది. గత ఆదివారం విన్నర్ ని ప్రకటించారు. సన్ని విజేతగా, షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచారు. మూడో స్థానాన్ని మాజీ ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర పొందారు. ఇదిలా ఉంటే ఈ బిగ్ బాస్ సీజన్ 5 అంతా డల్ గా గడిచింది. గత సీజన్స్ తో పోలిస్తే రేటింగ్ లోనూ బాగా వెనుకబడింది. దానికి కారణం అంత ఆసక్తిగా లేకపోవడంతో పాటు పాల్గొన్న వారికి అంతంత ఇమేజ్…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులోనూ సుపరిచితుడే . అయన నటించిన తమిళ్ సినిమాలు తెలుగులో డబ్ అవుతాయి. ఇప్పటివరకు టాలీవుడ్ లో స్ట్రైట్ ఫిల్మ్ లో నటించని ధనుష్ తాజాగా తన స్ట్రైట్ ఫిల్మ్ ప్రకటించేశాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణంలో చిత్రంతో తన డైరెక్ట్ తెలుగు సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమాకు ‘తొలిప్రేమ’ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా.. సూర్యదేవర నవ వంశీ నిర్మాతగా వ్యవహరించనున్నారు.…