టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం పరాజయాలను చవి చూస్తున్నాడు. ఇటీవల విడుదలైన మహా సముద్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే శర్వా నటిస్తున్న కొత్త చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని . డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు – ఎస్.ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి…
‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య, సంజన సారధి జంటగా డాక్టర్ సందీప్ చేగూరి దర్శకత్వంలో బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘సరసాలు చాలు’. ఈ సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తనయుడు సాయికిరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యూనిట్ సభ్యులకు సాయికిరణ్ స్క్రిప్ట్ అందించగా, శ్రీమతి శ్రుతిరెడ్డి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. చంద్రాకాంత్ రెడ్డి, రోహిత్ కెమెరా స్విచ్చాన్…
నివేతా థామస్.. అందం, అభినయం కలగలిపిన హీరోయిన్. టాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలను ఎంచుకొని వరుస విజయాలను అందుకొంటుంది. ఇక పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ గా వచ్చినా వకీల్ సాబ్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన నివేతా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన తమ్ముడు నిఖిల్ తో ఫన్నీ వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా నెట్టింట వైరల్ గా…
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఒక పక్క సినిమాలలో నటిస్తూనే మరోపక్క బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. రౌడీ పిక్చర్స్ అనే పేరుతో ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసిన ఈ జంట అందులో సినిమాలను నిర్మిస్తున్నారు. తాజాగా విగ్నేష్ దర్శకత్వంలో వసంత్ రవి నటించిన చిత్రం ‘రాకీ’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది. ఇక…
కన్నడ రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరక్కేక్కిన కెజిఎగ్ చిత్రం ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో పతత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినా ఈ చిత్రం ప్రపంచ స్థాయిలో సినీ ప్రేక్షకులను మెప్పించి హీరో యష్ ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసింది. ఇక ప్రస్తుతం అభిమానులందరూ కేఈజిఎఫ్ పార్ట్ 2 కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇపప్టికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ రికార్డులు సృష్టించాయి.…
టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఒక పక్క ఆమె నటించిన ‘హీరో’ చిత్రం విడుదలకు సిద్ధం అవుతుండగా మరోపక్క పవన్ కళ్యాణ్ తో ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ని జరుపుకొంటుంది. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నిధి యువరాణిగా కనిపిస్తోంది. ఇప్పటికే చేలా సార్లు పవన్ తో నటించడం గొప్ప వరమని చెప్పుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ తాజాగా మరోసారి పవన్ ని పోగొడ్తలతో ముంచెత్తింది. తాజాగా సోషల్…
తెలుగునాట ఓ హీరో ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రంగా అన్నపూర్ణ వారి ‘ఇద్దరు మిత్రులు’ను పేర్కొంటూ ఉంటారు. అంతకు ముందు 1950లలోనే తెలుగులో ద్విపాత్రాభినయ చిత్రాలు రూపొందాయి. 1950లో తమిళ హీరో ఎమ్.కె. రాధా ద్విపాత్రాభినయం చేసిన ‘అపూర్వ సహోదరులు’ తొలి డ్యుయల్ రోల్ మూవీ అని చెప్పవచ్చు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. ఇందులో మన భానుమతి కథానాయిక. తెలుగువారయిన సి.పుల్లయ్యనే దర్శకులు. ఆ తరువాత 1953లో ‘చండీరాణి’లో భానుమతి ద్విపాత్రాభినయం చేశారు.…
రాజేశ్ ఖన్నాను ఇప్పటికీ హిందీ చిత్రసీమలో “ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా” అంటూ కీర్తిస్తుంటారు. అంటే అంతకు ముందు హిందీ సినిమా రంగంలోని దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవానంద్ వంటి స్టార్స్ ‘సూపర్ స్టార్స్’ కాదా అన్న అనుమానం కలుగక మానదు. అంతకు ముందు స్టార్ హీరోస్ కు రాజేశ్ ఖన్నాకు తేడా ఉంది. అదేంటంటే, రాజేశ్ కంటే ముందు స్టార్ డమ్ చూసిన వారంతా ముందు తమ సత్తా నిరూపించుకున్న తరువాతే…
తెలుగు చిత్రసీమలో అసలు సిసలు మాటల మాంత్రికుడు అంటే పింగళి నాగేంద్రరావు అనే చెప్పాలి. తెలుగు సినిమా పలుకుకు ఓ జిలుగునద్దిన ఘనత నిస్సందేహంగా పింగళివారిదే అనడం అనతిశయోక్తి! పింగళి వారి రచనలో జాలువారిన పదాలను పరిశీలించి చూస్తే, వాటిలో గమ్మత్తు ఉంటుంది, మత్తూ ఉంటుంది. ఆపైన మనల్ని చిత్తు చేసే గుణమూ కనిపిస్తుంది. చూడటానికి మనకు బాగా తెలిసిన పదాలనే ఆయన ఉపయోగించిన తీరు గమ్మత్తు చేసి చిత్తు చేస్తుంది పింగళి నాగేంద్రరావు 1901 డిసెంబర్…
యంగ్ హీరో నాగశౌర్య నటించిన రెండు సినిమాలు ఈ యేడాది ద్వితీయార్థంలో విడుదలయ్యాయి. చిత్రం ఏమంటే ఈ రెండు చిత్రాల ద్వారా ఇద్దరు కొత్త దర్శకులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నాగశౌర్య, రీతువర్మ జంటగా నిర్మించిన ‘వరుడు కావలెను’ మూవీతో లక్ష్మీ సౌజన్య తొలిసారి మెగాఫోన్ పట్టింది. ఇది అక్టోబర్ 29న విడుదల కాగా ఈ డిసెంబర్ 10న నాగశౌర్య నటించిన ‘లక్ష్య’ మూవీ జనం ముందుకు వచ్చింది. బాధాకరం…