ఎవరేం అనుకున్నా సరే..మా రిలేషన్ అదే.. నటి కూతురు షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి సురేఖావాణి. ఇక గత కొన్నేళ్లుగా ఆమె తన కూతురు సుప్రీతను కూడా హీరోయిన్ గా చేయడానికి పలు ప్రయత్నాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక సుప్రీతా అందచందాల గురించి కానీ, అమ్మడు పెట్టే హాట్ హాట్ ఫోటోషూట్ల గురించి కానీ సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సురేఖ సైతం, కూతురుతో కలిసి చిట్టిపొట్టి డ్రెస్సులో చిందులు వేస్తూ కనిపిస్తుంటుంది. మధ్యమధ్యలో ఈ తల్లీకూతుళ్లు అభిమానులతో చిట్ చాట్ చేస్తూ నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటారు. ఇక తాజాగా సుప్రీత తన అభిమానులతో కలిసి చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా తన బాయ్‌ఫ్రెండ్ గురించి అడిగిన ఓ నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చింది.
సుప్రీత చేసే రీల్స్ లో ఎక్కువగా నందు అనే కుర్రాడు కనిపిస్తూ ఉంటాడు. చాలామంది అతనిని సుప్రీత బాయ్ ఫ్రెండ్ అని అనుకుంటారు. అదే విషయాన్ని ఒక నెటిజన్ అడిగాడు. నందుకు, మీకు ఉన్న రిలేషన్ ఏంటి..? నందు బాయ్ ఫ్రెండా..? లేక బాయ్ బెస్టీనా అని అడిగాడు. దీనికి తడుముకోకుండా సుప్రీత ‘అవును.. ప్రతి అమ్మాయికి అలాంటి ఒక స్నేహితుడు ఉండాలి. ఒక అబ్బాయి.. అమ్మాయి స్నేహితులుగా ఉండలేరని అందరూ అనుకుంటారు. కానీ.. మేం స్నేహితులుగా ఉన్నాం. ఎవరేం అనుకున్నా సరే.. ఎప్పటికి మేం బెస్ట్ ఫ్రెండ్స్’’ అని మొహమాటపడకుండా చెప్పేసింది. అంతకుముందు కూడా నందు తనకు మంచి ఫ్రెండ్ అని , అన్ని తనతోనే షేర్ చేసుకొంటానని చెప్పుకొచ్చింది. దీంతో నందు ఆమె స్నేహితుడు మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం సుప్రీత వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
- Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
తాజావార్తలు
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?