‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు కూడా భారీ విజయాలను అందుకున్నాయి. దీంతో అమ్మడు టాలీవుడ్ గోల్డెన్ లెగ్ గా మారింది. ఇక తాజగా బంగార్రాజు సక్సెస్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న కృతి శెట్టి తన మనసులోని మాటలను బయటపెట్టింది. ‘ఉప్పెన’ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు మొదట చేయాలనీ అనుకోలేదని, కథ విన్నాకా నచ్చి ఆ పాత్ర చేయాలనీ అనుకున్నట్లు తెలిపింది.
ఇక శ్యామ్ సింగరాయ్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ అనే భావన తనకు కలగలేదని, ఆ ఫీల్ రాకుండా చిత్ర బృందం తనను బాగా చూసుకున్నారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఉప్పెన చిత్రంలో బీబమ్మ పాత్రకు పూర్తీ విరుద్ధంగా తార పాత్ర ఉంటుందని, అందుకే శ్యామ్ సింగరాయ్ ఒప్పుకున్నట్లు తెలిపింది. ఇక టాలీవుడ్ హీరోల్లో ఎవరితో నటించాలని ఉంది అంటే.. టక్కున మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు చెప్పేసింది. రంగస్థలం సినిమా చూసాక ఆయన నటనకు ఫిదా అయిపోయానని, అందులో చరణ్ చాలా గొప్పగా నటించారు.. ఆ సినిమా చూశాక ఆయనతో నటించాలని ఉంది అని తన మనసులో మాట బయటపెట్టింది. మరి బేబమ్మ కోరిక త్వరలోనే తీరుతుందేమో చూడాలి.