బ్రేకింగ్: దాసరి నారాయణరావు కొడుకు అరుణ్ అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమను ఒక స్థాయిలో నిలబెట్టిన దర్శకుల్లో దాసరి నారాయణరావు ఒకరు. ఇండస్ట్రీకి ఆయన చేసి సేవలు అలాంటివి.. అయితే ఆయన సంపాదించుకున్న అంత గొప్ప పేరును ఆయన కొడుకులే తుడిచేయడం కడు బాధాకరం. దాసరి కొడుకులు.. ఆయన చనిపోయాక ఆస్తి గొడవలతో రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. దాసరి చిన్న కొడుకు నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటాడు. మొన్నామధ్య స్థలం గొడవలో ఒకరిని చంపేస్తానని బెదిరించిన వివాదం నుంచి తేరుకోకముందే మరో వివాదంలో అరుణ్ చిక్కుకున్నాడు.
గురువారం తెల్లవారుజామున తప్పతాగి.. కారు డ్రైవ్ చేసి రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సయ్యద్ నగర్ లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రెండు బైక్ లను ఢీకోట్టినట్లు తెలుస్తోంది. అప్పటికే అరుణ్ మద్యం తాగి నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 405 సూచించిందని, వెంటనే ఆయనను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అరుణ్ పై కేసు నమోదు చేసి.. సీసీ టీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే దాసరి అరుణ్ హీరోగా పలు సినిమాల్లో కనిపించిన సంగతి తెలిసిందే.
Also Read
తాజావార్తలు
-
Under-19: అండర్-19 ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన.. జట్టులో సచిన్, ద్రవిడ్, సెహ్వాగ్ వారసులు..
-
#NBKxKoratalaSiva: ఆ వార్తలు నిజం కాదు.. తేల్చేసిన టీమ్!
-
Fire Accident: విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్‌లో అగ్నిప్రమాదం.. సీ హార్స్ జంక్షన్ సమీపంలో ఎగిసిపడుతున్న మంటలు..
-
Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి.?
-
NZ Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్స్ అవుట్.. కీలక మార్పులు చేసిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!