Kajol: బాలీవుడ్ బ్యూటీ కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే లస్ట్ స్టోరీస్ 2 లో మంచి బోల్డ్ లుక్ లో కనిపించి మెప్పించిన ఈమె.. ఈ సిరీస్ తరువాత మంచి అవకాశాలనే అందుకుంటుంది. ఇప్పటికే రాఘవేంద్రరావు కోడలు కనికా థిల్లాన్ నిర్మాతగా మారి నిర్మిస్తున్న ఒక చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.
Salaar Teaser: ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం త్వరగా పడుకోవడానికి సిద్ధమవుతున్నారు. 3 గంటల వరకు సోషల్ మీడియాలో ఉండేవారు కూడా ఈరోజు 11 గంటలకే దుప్పటి ముసుగేస్తున్నారు. అయ్యా.. దేనికి.. అంత హడావిడి అనుకుంటున్నారా.. ? రేపు జూలై 6.. అంటే సలార్ టీజర్ వచ్చేరోజు అన్నమాట. అందుకే డార్లింగ్ ఫ్యాన్స్ అందరు త్వరగా పడక ఎక్కేస్తున్నారు. ఎందుకు అంత త్వరగా.. లేచాకనే కదా రిలీజ్ అనుకుంటే పొరబాటే.. సలార్ టీజర్ రేపు ఉదయం 5 గంటల…
Allu Arjun: ఒక రంగంలో పనిచేసేవారి మధ్య పోటీ ఉండడం సహజమే. అలాగే సినీ ఇండస్ట్రీలో కూడా పోటీ ఉంది. టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఎప్పుడు కలిసే ఉంటారు. సినిమాలపరంగా పోటీ పెట్టుకుంటారేమో కానీ, వ్యక్తిగతంగా అందరు కలిసే ఉంటారు. ఈ విషయాన్ని అందరు హీరోలు ఎన్నోసార్లు రుజువు చేశారు. కానీ, హీరోలు కలిస్ ఉన్నట్లు హీరోల అభిమానులు కలిసి ఉండడం లేదు.
Sitara Ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకపక్క సినిమాలు.. ఇంకోపక్క యాడ్స్ తో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ లోనే కాదు ఇండస్ట్రీ మొత్తంలో అత్యధిక యాడ్స్ చేసి .. ఎన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గామారిన ఏకైక హీరో మహేష్ బాబు. ఇక యాడ్ చేసినా కూడా మహేష్ సినిమాకు తీసుకొనేంత రెమ్యూనిరేషన్ తీసుకుంటాడు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సంబంధించిన ఏ వార్త వచ్చినా.. సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అందులో నిజం ఎంత..? అబద్దం ఎంత.. ? అనేది ఎవరు చూడరు. పవన్ అంటే గిట్టని వారు విమర్శిస్తారు.. ఇష్టం ఉన్నవారు సమర్థిస్తారు. ఇక గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్.. తన మూడో భార్య అన్నా లెజినోవాకు విడాకులు ఇస్తున్నాడని ఒక వార్త సోషల్ మీడియాను కుదిపేసింది.
Ram Charan: అభిమానం ఎలా ఉంటుందో హీరోల అభిమానులను చూస్తేనే తెలుస్తూ ఉంటుంది. తమ హీరోను అభిమానించే అభిమానులు వారి గురించే ఆలోచిస్తూ ఉంటారు. వారికి ఏదైనా కష్టం వచ్చింది అంటే.. వీరు తట్టుకోలేరు. వారింట్లో ఆనందం ఉంటే.. వీరు కూడా సంబరాలు చేసుకుంటారు. ఇక ఈ అభిమానాన్ని హీరోలు అవకాశం గా తీసుకుంటున్నారా.. ? అంటే నిజమే అంటున్నారు కొంతమంది నెటిజన్లు.
Niharika Divorce: సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి ఆహరం తింటారు.. ? ఎలాంటి బట్టలు వేసుకుంటారు..? ఎలాంటి ఇళ్లలో ఉంటారు.. ? ఇలాంటివన్నీ తెలుసుకోవాలని వారిలా బతకాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే చాలామంది వారు కూడా అందరిలానే మనుషులే..
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల డివోర్స్ గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మూడేళ్ళ క్రితం చైతన్య జొన్నలగడ్డను అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది నిహారిక. ఇక రెండేళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య అనుకోని విబేధాలు తలెత్తాయి. ఇక ఆ విబేధాలు చిలికి చిలికే గాలివానగా మారి విడాకుల వరకు వచ్చాయి.
Sai Sushanth Reddy: ఈ నగరానికి ఏమైంది సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిలీజ్ అయినప్పుడు కన్నా.. రీరిలీజ్ అయ్యినప్పుడు మరింత హైప్ తెచ్చుకున్న ఈ సినిమాలో ప్రతి ఒక్క హీరో గురించి, వారి పాత్రల గురించి పూస గుచ్చినట్లు చెప్పుకొస్తారు అభిమానులు. ఇక అందులో మెయిన్ హీరోగా నటించిన సాయి సుశాంత్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Salaar: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది .. అని పాడుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. నిజం చెప్పాలంటే .. ఈ ఏడాది ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అటు సంతోషంగా.. ఇటు బాధలో మిక్స్డ్ భావోద్వేగాలతో ఉన్నారు. ప్రభాస్.. ఆదిపురుష్ తో తెరపై కనిపించినందుకు సంతోష పడాలా.. సినిమా ప్లాప్ అయ్యినందుకు బాధపడాలా అని తెలియని పరిస్థితిలో ఉన్నారు.