Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. ప్రస్తుతం బ్రో సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్ తో పాటు తేజ్ నటిస్తున్న ఈ సినిమాకు సముతిరఖని దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ మాటలు అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన తేజ్.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచేస్తున్నాడు. ఇక రెండేళ్ల క్రితం తేజ్ కు బైక్ యాక్సిడెంట్ అయిన విషయం తెల్సిందే. ఇప్పుడిప్పుడే ఆ ప్రమాదం నుంచి బయటపడిన తేజ్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. అయితే యాక్సిడెంట్ తరువాత తేజ్ లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా డ్యాన్స్ చేయలేకపోతున్నాడు. ఒకప్పుడు టాప్ 10 డ్యాన్సర్స్ లో ఒకడిగా పేరు తెచ్చుకున్న తేజ్ .. ఇప్పుడుఅస్సలు డ్యాన్స్ చేయలేకపోతున్నాడు. బ్రో సినిమా నుంచి వచ్చి సాంగ్స్ లో తేజ్ డ్యాన్స్ ఈజ్ లేదని, ఆయన డ్యాన్స్ నచ్చలేదని అభిమానులు పెదవి విరిచారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై తేజ్ స్పందించాడు.
Priya Prakash Varrier: స్లీవ్ లెస్ టాప్ ధరించి కాక రేపుతున్న ప్రియా ప్రకాష్ వారియర్
“యాక్సిడెంట్ తరువాత నా శరీరం లో చాలా మార్పులు వచ్చాయి. నా డాన్సు మీకే కాదు..నాకే నచ్చడం లేదు. అభిమానుల్ని ఆ రకంగా బాధ పెడుతుందన్నందుకు క్షమించండి. శరీరం లో అన్ని భాగాలు సునాయాసంగా కదిపే వెసులు బాటు నాకు ఇంకా రాలేదు. అందుకు సమయం పడుతుంది. అప్పుడు ఖచ్చితంగా నా డ్యాన్స్ తో మిమ్మల్ని అందరిని అలరిస్తాను. ఇప్పుడిప్పుడే నా శరీరం నాకు అనుకూలంగా మారుతోంది. నేను కోమాలో ఉన్నప్పుడు స్టెరాయిడ్స్ ఇచ్చారు. అలా ఫిట్ నెస్ కోల్పోయాను. త్వరలోనే కోలుకుంటాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.