Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంట్రవర్సీ క్వీన్ గా అమ్మడికి ఎంత ఎలాంటి పేరు ఉందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడుతూ.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తుంది. ఇక తన గురించి ఎవరైనా నెగిటివ్ ప్రచారం వస్తే చీల్చి చెండాడేస్తుంది. ఇక బాలీవుడ్ లో పెద్దల గురించి, బాలీవుడ్ మాఫియా గురించి ఆమె ఎన్నోసార్లు సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గురించి వరుస పోస్టులు పెడుతూ నిప్పులు చెరిగింది. పరోక్షంగా ఆలియా భట్- రణబీర్ కపూర్ జంటను ఉద్దేశించి ఇన్స్టాలో పోస్ట్ చేసింది. వారిది నకిలీ పెళ్లి అని, దాని నుంచి బయటపడేందుకు రణబీర్ ప్రయత్నిస్తున్నాడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా మాఫియా డాడీ వలనే రణబీర్ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ఆరోపించింది. ఈ మధ్యనే ఒక వర్గం కంగనాను ట్రోల్ చేసిన విషయం తెల్సిందే. కంగనా, విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్న చిత్రంపై విమర్శలు రావడంతో వాటిపై స్పందింస్తూ.. రణబీర్ జంటపై నిప్పులు చెరిగింది. “నేను ఎప్పుడు ఏ కొత్త సినిమా ప్రకటించినా, భయంకరమైన నెగెటివ్ ప్రచారం జరుగుతుంది. ఇలాంటి అసహ్యకరమైన బల్క్ మాస్ మెయిల్‌లు విపరీతంగా ప్రచారం పొందుతాయి. అన్ని పేపర్లలో ఒకే హెడ్‌లైన్ ఎలా ఉంటుంది? దీనిని బల్క్ మాస్ మెయిల్ అంటారు. నన్ను చూసి మీరు బాధపడితే.. మీకోసం ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. భగవాన్ వారి ఆత్మకు శాంతి చేకూర్చండి. ఇలా నాపై దుష్ప్రచారం చేస్తున్న చెంగుమంగు గ్యాంగ్‌కు ఒక్కటే చెబుతున్నా. నన్ను చూస్తే మీకెందుకు అంత అసూయ కలుగుతోంది” అంటూ రాసుకొచ్చింది.
Bigg Boss Telugu 7: కుడి ఎడమ అయితే పొరపాటు లేదోయ్ .. నాగ్ ప్రోమో వచ్చేసిందోచ్
ఇక రణబీర్- ఆలియా జంట గురించి ఆమె మాట్లాడుతూ.. ” సినిమా ప్రమోషన్స్, డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటే ఇలానే జరుగుతుంది. అతను పెళ్లి చేసుకుంది ప్రేమతో కాదు.. మాఫియా డాడీ ఒత్తిడితో పెళ్లి చేసుకున్నాడు. ఫేక్ మ్యారేజ్ నుంచి బయటపడేందుకు ఇప్పుడు ప్రయత్నిస్తున్నాడు. కానీ, అతడికి సాయం చేసేవారు ఎవరూ లేరు. అతను నన్ను కలవమని ప్రాధేయపడుతున్నాడు. ఇటీవలి ఫ్యామిలీ ట్రిప్ నుంచి భార్య, కుమార్తె ఎందుకు దూరమయ్యారు? భర్త అని పిలవబడే వ్యక్తి నన్ను వేడుకుంటూ మెసేజ్‌లు ఎందుకు పంపుతున్నాడు? అతడిని కలవమని ఎందుకు వేడుకున్నాడు? ఇది వాస్తవమో కాదు. భార్య, కుమార్తెపైనే అతడు దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇది భారత్. ఒక్కసారి పెళ్లి అయితే.. అంతే” అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.