Baby: ఒకే ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకుంది వైష్ణవి చైతన్య. బేబీ సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించారు. జూలై 14 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. పెద్ద విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ ను రాబడుతోంది. లవ్ ఫెయిల్యూర్స్ ఈ సినిమాను బాగా ఓన్ చేసుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఇద్దరు హీరోలను మోసం చేసి మూడోవాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. ఈ పాయింట్ కు నేటి యువత చాలా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా ప్రేమ విఫలమయిన అబ్బాయిలు వైష్ణవిలో తమ మాజీ ప్రేయసిని ఉహించుకుంటున్నారు. అది ఎంతలా అంటే.. బయట బేబీ పోస్టర్ చూసినా, ఫ్లెక్సీ కనిపించినా అందులో ఉన్న వైష్ణవి ఫోటోను చెప్పులతో కొడుతున్నారు.
NTR: అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే.. నెక్స్ట్ సీఎం ఎన్టీఆరే
తాజాగా ఒక యువకుడు వైష్ణవి ఫోటోను చెప్పుతో కొడుతున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అంటే అంతలా ఆ క్యారెక్టర్ కు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారని అర్ధం. సినిమా నుంచి బయటికి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు హీరోయిన్ ను తిట్టుకుంటూనే బయటకు వచ్చాడు అంటే అతిశయోక్తి లేదు. నిజం చెప్పాలంటే.. ఒక పాత్రను ఇంతలా కనెక్ట్ చేసుకొని.. థియేటర్ నుంచి బయటకు వచ్చినా కూడా ఆడే పాత్ర మనసులో, మైండ్ లో ఉండడం అనేది చాలా రేర్ గా జరుగుతోంది. ప్రస్తుతం వైష్ణవి పాత్ర కూడా అలాగే కుర్రకారుకు ఒక డ్రగ్ లా ఎక్కేసింది. బేబీ లో వైష్ణవి పాత్ర ఎంతలా జనాలను ఎక్కేసిందో చెప్పాలంటే.. ఈ ఒక్క వీడియో చాలు అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.