Chiranjeevi: ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. స్టార్ హీరోల పుట్టినరోజులకు, సినిమా వార్షికోత్సవాలకు సినిమాలను రీరిలీజ్ లను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే స్టార్ హీరోల హిట్ సినిమాలు రీ రిలీజ్ అయ్యి భారీ విజయాలను అందుకోవడమే కాకుండా మంచి కలక్షన్స్ కూడా అందుకున్నాయి. ఇక రీ రిలీజ్ అంటే అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా చిరంజీవి కల్ట్ క్లాసిక్ మూవీస్ రీరిలీజ్ అంటే హడావిడి మాములుగా ఉండదు. ఇక తాజాగా చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. చిరంజీవి, శ్రీదేవి జంటగా.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించాడు.
TFJA: ఆ విషయంలో సినీ సెలబ్రెటీలకు అండగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్
1990 వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా అతిలోక సుందరిగా శ్రీదేవి ఆహార్యం, అభినయం ఇప్పటికి ఏ తెలుగు ప్రేక్షకుడు మర్చిపోడు. అంతటి అందమైన వనితను ఈ భూలోకంలో ఎక్కడా చూసి ఉండరు అని ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు శ్రీదేవిని పొగుడుతూ ఉంటారు. ఇక రాజు గా చిరు నటన అయితే అద్భుతం. ఇళయరాజా సంగీతం.. ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆగస్టు 22 న చిరు బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. చిరు ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి. అబ్బని తీయని దెబ్బ అంటూ.. థియేటర్ లోనే సాంగ్స్ కు డ్యాన్స్ వేస్తూ రచ్చ చేయడం ఖాయమని చెప్పొచ్చు. మరి త్వరలోనే మేకర్స్ అధికారిక అనౌన్స్ మెంట్ ఇస్తారేమో చూడాలి.