Prem Kumar Trailer: కుర్ర హీరో సంతోష్ శోభన్ ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎంతగానో కష్టపడుతున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే అన్ని మంచి శకునములే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంతోష్.. భారీ పరాజయాన్ని చవిచూశాడు. అయినా దిగులుపడకుండా హిట్ కోసం తాపత్రయపడుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే సంతోష్ నటిస్తున్న కొత్త చిత్రం ప్రేమ్ కుమార్. అభిషేక్ మహర్షి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శరంగ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై శివ ప్రసాద్ పన్నేరు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. ఈ సినిమాలో సంతోష్ సరసన రాశీ సింగ్ నటిస్తోంది.
Guppedantha Manasu: రిషి తల్లి ఎంత హాట్ గా ఉందో చూశారా.. ?
“నా పేరు ప్రేమ్ కుమార్.. పెళ్లిళ్లు ఆగిపోవడం లో నాకొక ట్రాక్ రికార్డ్ ఉంది” అని సంతోష్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలయ్యింది. ప్రేమ్ కుమార్ కు పెళ్లి గండం ఉంటుంది. పెళ్లి వరకు వచ్చినా కూడా అతనికి పెళ్లి కాదు. ఇక ఇలా పెళ్లిళ్లు ఆగిపోయి ట్రాక్ రికార్డ్ అందుకున్న పీకే.. ఒక కంపెనీ పెడతాడు. అందులో పెళ్ళికి ముందు కానీ, పెళ్లి తరువాత కానీ భార్యాభర్తల మధ్య సాగే ఇల్లీగల్ ఎఫైర్స్ ను వెతికే డిటెక్టివ్ గా మారతాడు. అలా అతనికి ఒక హీరో పెళ్లి ఆపాలని ఆఫర్ వస్తుంది. దీంతో పీకే.. ఆపనిలో ఉంటాడు. ఇక అదే సమయంలో ఆ హీరో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి.. పీకే తో లవ్ లో పడుతోంది. పీకే మాత్రం మరో అమ్మాయితో ప్రేమలో పడతాడు.. అసలు పీకేకు పెళ్లి ఎందుకు జరగడం లేదు.. హీరో పెళ్లి ఆపడానికి పీకే ఏం చేశాడు. చివరికి పీకేను ఎవరు పెళ్లాడారు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ట్రైలర్ చూస్తుంటే.. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా కనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతోనైనా సంతోష్ శోభన్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.