Bigg Boss Telugu 7: ఎన్నాళ్ళో వేచిన ఉదయం .. ఈరోజే ఎదురయ్యింది.. బిగ్ బాస్ 7 ఎట్టకేలకు వచ్చేస్తోంది అంటూ పాడేసుకుంటున్నారు ప్రేక్షకులు. బుల్లితెర రియాలిటీ షోగా బిగ్ బాస్ కు ఒక గుర్తింపు ఉంది. ఇప్పటివరకు ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తిచేసిన బిగ్ బాస్ .. ఇప్పుడు ఏడవ సీజన్ కు రెడీ అవుతోంది. కొన్ని కారణాల వలన లేట్ అయినా .. లేటెస్ట్ గా వస్తున్నామని ఈ మధ్యనే బిగ్ బాస్ ప్రోమో ను రిలీజ్ చేసి షాకిచ్చారు మేకర్స్. ఇక ఇప్పటివరకు ఈ సీజన్ కు హోస్ట్ ఎవరు..? అంటూ ఆసక్తి నెలకొనడమే కాకుండా డిబేట్ లు కూడా జరిగాయి. నాలుగు సీజన్స్ నుంచి అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఏడవ సీజన్ కు నాగ్ కాకుండా కొత్త హోస్ట్ వస్తున్నాడంటూ వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిసిపోయింది. ఈ సీజన్ కు కూడా మన్మథుడే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడని మేకర్స్ అధికారికంగా తెలిపేశారు.
Baby: వైష్ణవి చైతన్యను చెప్పుతో కొట్టిన అభిమాని.. వీడియో వైరల్
తాజాగా.. నాగ్ కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. అల్ట్రా స్టైలిష్ లుక్ లో నాగ్ అదరగొట్టేశాడు. చేతిలో పాప్ కార్న్ డబ్బా పట్టుకొని.. ” బిగ్ బాస్ సీజన్ 7.. ఈసారి సీజన్.. ఏం చెప్పాలి..చాలా కొత్తగా చెప్పాలి.. హా.. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. ” అంటూ చిటికె వేయగానే.. అక్కడ ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని ఒక్కసారిగా రివర్స్ అవ్వడం చూపించారు. దీంతో ఈ సీజన్ లో మేకర్స్ ఏదో కొత్తగానే ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈసారి ఈ సీజన్ లో ఎలాంటి కంటెస్టెంట్స్ వస్తారో.. వారిని నాగ్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.