Guppedantha Manasu: బుల్లితెర టాప్ సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ ఒకటి. డైరెక్టర్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సీరియల్ అంటే అభిమానులకు ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిషి,వసుధార, జగతి, మహేంద్ర.. ఇలా వారి పాత్రలే పేర్లనే అభిమానులు సొంత పేర్లుగా మార్చేశారు. రిషిధార పేరుతో సోషల్ మీడియాలో వారికి ఉన్న ఫ్యాన్స్ ఇంకెవరికి లేరు అనే చెప్పాలి. వారి తరువాత అంతగా పేరు తెచ్చుకున్న పాత్ర జగతి. కొడుకు కోసం ఏదైనా చేసే తల్లిగా.. ఇండిపెండెట్ విమెన్ గా ఆమె పాత్ర ఆకట్టుకొంటుంది. ఆ పాత్రకు ప్రాణం పోసింది కన్నడ నటి జ్యోతి రాయ్. ఆమె ఒక హీరోయిన్. కన్నడలో స్టేషన్ 3, సిల్లీ లిల్లీ, శుభమాంగళ్య, కిన్నెర, జోగుల, జోజో లాలీ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో గుప్పెడంత మనసు.. జ్యోతికి మంచి పేరు తెచ్చిపెట్టింది.
Mehar Ramesh : ఎన్టీఆర్ తో అలాంటి సినిమా చేయాలి అనుకున్నాను..?
ప్రస్తుతం ఆమెను జ్యోతి అని పిలవడం మానేసి జగతి అని పిలుస్తున్నారు. ఇక ఈ భామ సీరియల్ లో ఎంత పద్దతిగా కనిపిస్తుందో.. బయట అంత హాట్ గా కనిపిస్తూ పిచ్చెక్కిస్తూ ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అభిమానులను అలరిస్తున్న జగతి తాజాగా మరో హాట్ ఫోటోతో అదరగొట్టింది. ఈ ఫోటో పాతదే అయినప్పటికీ.. అభిమానులు మాత్రం కళ్ళు తిప్పుకోకుండా చూస్తూ వైరల్ గా మార్చేస్తున్నారు. రెడ్ కలర్ మినీ స్కర్ట్ వేసుకొని.. బెడ్ పై పడుకొని టాప్ యాంగిల్ లో ఆమె అందాలను ఆరబోస్తూ కనిపించింది. సడెన్ గా ఆమెను చూసి జగతి అనుకోవడం కష్టమే.. దీంతో అభిమానులు దేవుడా.. ఈమె జగతీనా అంటూ నోళ్లు వెళ్లబెడుతున్నారు. అంత అందం ఉండి.. తల్లి పాత్రలు ఎందుకు చేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే జ్యోతి రాయ్ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కూడా నటిస్తోంది.