Heroine: సాధారణంగా ఎవరైనా ఇండస్ట్రీలోకి రావాలి అంటే ఆడిషన్స్ ఇచ్చి తీరాలి. అది ఎవరైనా సరే. హీరో పిల్లలు అయినా.. డైరెక్టర్ పిల్లలు అయినా ఆడిషన్స్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు స్టార్స్ గా మారిన వారందరి మొదటి సినిమాలు చూస్తే.. ఏంటి వీరువారు ఒక్కరేనా అని అనిపిస్తుంది. అలాగే ఈ మధ్య రామ్ చరణ్, శ్రీయ మొట్ట మొదటి ఆడిషన్ ఇచ్చిన వీడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెల్సిందే.
Director Bobby:మాస్ మహారాజా రవితేజ ఇండస్ట్రీకి ఎంతోమంది కొత్త డైరెక్టర్లను పరిచయం చేశాడు. అందులో బాబీ ఒకడు. పవర్ అనే సినిమాతో బాబీ అలియాస్ కొల్లి రవీంద్ర డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక రెండో సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని అందుకున్నాడు.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సామ్.. రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఒక ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంది. ఇక దాంతో పాటు మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటుంది. సినిమాలు మాత్రమే సామ్ చేయడం ఆపేసింది..కానీ, సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
Suhasini Maniratnam: సీనియర్ సుహాసిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముగ్ద మనోహరమైన మోము.. నవ్వితే ముత్యాలు రాలేనేమో అనేంత అందమైన రూపం ఆమె సొంతం. అచ్చ తెలుగు అమ్మాయిలా అనిపించే తమిళ్ కుట్టీ సుహాసిని. ఇక స్టార్ డైరెక్టర్ మణిరత్నంను ప్రేమించి పెళ్ళాడి.. సుహాసిని మణిరత్నంగా మారింది.
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ ను అందుకుంది.
Anchor Suma: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవ్వడానికి కేరళ అమ్మాయి అయినా కూడా అచ్చ తెలుగు అమ్మాయిలా ఎన్నో ఏళ్లుగా ఆమె కలిసిపోయి జీవిస్తుంది. తెలుగు అమ్మాయిల కన్నా ఎంతో ఎక్కువగా తెలుగు మాట్లాడగలదు. తెలుగు అబ్బాయి రాజీవ్ ను వివాహమాడి ఇక్కడే సెటిల్ అయ్యిపోయింది.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. కెజిఎఫ్ తో భారీ హిట్ ను అందుకున్న హోంబాలే ఫిల్మ్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గతేడాది డిసెంబర్ 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. రికార్డ్ కలక్షన్స్ రాబట్టి.. ప్రభాస్ సత్తా ఏంటో మరోసారి నిరూపించింది.
Kaatera: ఒకప్పుడు కన్నడ సినిమాల గురించి కానీ, కన్నడ హీరోల గురించి కానీ టాలీవుడ్ లో చాలాతక్కువ మందికి తెలుసు. కానీ, ఎప్పుడైతే కెజిఎఫ్ వచ్చిందో.. పాన్ ఇండియా లెవల్లో సినిమా ప్రేక్షకులు అందరూ ఒక్కటిగా మారారు కథ బావుంటే.. ఎలాంటి సినిమా అయినా చూస్తామని నిరూపించారు.
Vetrimaaran: లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా ఇంకా చిక్కులోనే నడుస్తున్న విషయం తెల్సిందే. పెళ్లి తరువాత ఈ చిన్నది ఒకపక్క హీరోయిన్ గా.. ఇంకోపక్క నిర్మాతగా కొనసాగుతోంది. తన సినిమాలను తన బ్యానర్ లోనే తెరకెక్కిస్తోంది. ఇక అలా వచ్చిన సినిమానే అన్నపూరిణి. నీలేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన రోజు నుంచే వివాదాలపాలు అవుతూనే వస్తుంది. ఒక బ్రాహ్మణ కుటుంబంలో…
Pushpa 2: పెళ్లి సందD చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ శ్రీలీల. ఈ సినిమా తరువాత ఈ ముద్దుగుమ్మకు ఆఫర్ల వెల్లువ కురిసింది. రవితేజ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, వైష్ణవ్ తేజ్, నితిన్.. సీనియర్, జూనియర్ హీరోలందరితో అమ్మడు జతకట్టింది. అందులో కొన్ని హిట్లు అందుకోగా .. ఎక్కువ పరాజయాలనే అందుకుంది. అయినా కూడా శ్రీలీలకు అవకాశాలు మాత్రం తగ్గలేదు.