Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలన్నీ వదిలేసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందదే. మయాసైటిస్ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఒక సంవత్సరం సినిమాలకు గ్యాప్ ఇచ్చి చికిత్స తీసుకుంటుంది. ఇక సినిమాలకు గ్యాప్ ఇచ్చినా కూడా సామ్.. ప్రేక్షకులకు, అభిమానులకు నిరంతరం సోషల్ మీడియా ద్వారా దగ్గరగానే ఉంటుంది. నిత్యం ఆమె చేసే పనులు, వెకేషన్, టూర్స్ కు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆనందపరుస్తుంది. ఇక ర ఎట్టకేలకు సమంత అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను తీసుకున్న ఏడాది టైం అయిపోయిందని, త్వరలోనే షూటింగ్స్ మొదలు పెట్టనున్నట్లు తెలిపింది.
ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని సమంత చెప్పుకొచ్చింది. “కొన్ని రోజులుగా చాలామంది నన్ను ఎప్పుడు షూటింగ్లో పాల్గొంటారు అని అడుగుతున్నారు. అయితే ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి. త్వరలోనే నేను షూటింగ్ లో పాల్గొనబోతున్నాను. ఇన్ని రోజులు జాబ్ లెస్ గా ఉన్నా.. ఇక ఇప్పుడు పని చేయాల్సిన సమయం వచ్చేసింది. నా హెల్త్ గురించి నా ఫ్రెండ్స్ తో కలిసి ఒక పాడ్ కాస్ట్ ప్రోగ్రాం చేసాం. అది త్వరలోనే రిలీజ్ కానుంది” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం సమంత చేతిలో సిటాడెల్ వెబ్ సిరీస్ ఉంది. అమెజాన్ లో ఈ సిరీస్ త్వరలోనే రిలీజ్ కు సిద్ధమవుతోంది. మరి ఈ సిరీస్ తో ఈ ముద్దుగుమ్మ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.