Trinadha Rao Nakkina: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్నవారందరూ ఏదో ఒక సమయంలో క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కున్న వారే. అప్పటి హీరోయిన్లలా నేటితరం హీరోయిన్లు ఉండడం లేదు. క్యాస్టింగ్ కౌచ్ అనే కాదు.. తమ ముందు కొద్దిగా ఎక్కువ తక్కువ మాట్లాడినా ముఖం మీదనే ఇచ్చిపడేస్తున్నారు. తాజాగా ఒక హీరోయిన్ పై డైరెక్టర్ అందరి ముందు హాగ్ ఇవ్వలేదని కంప్లైంట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయం ఏంటంటే.. స్టార్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారాడు. నక్కిన నెరేటివ్స్ బ్యానర్‌పై నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో ఇంద్ర రామ్ కథానాయకుడిగా చౌర్య పాఠం సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ హీరోయిన్ గా పరిచయమవుతుంది. ఇక ఈ సినిమా టీజర్ ను మేకర్స్ నిన్న అధికారికంగా లాంచ్ చేశారు.
ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో త్రినాథరావు నక్కిన, హీరోయిన్ తనకు హాగ్ ఇవ్వలేదని అందరిముందు చెప్పుకురావడం హైలైట్ గా నిలిచింది. “తెలుగమ్మాయి.. బెంగుళూరులో సెటిల్ అయ్యింది. తెలుగు బాగా మాట్లాడుతుంది. తనకు అన్ని తెలుసు.. మా యూనిట్ లో అందరిని హాగ్ చేసుకుంది కానీ, నాకు ఇప్పటివరకు కూడా హాగ్ ఇవ్వలేదు. నోరు విడిచి అడిగినా కూడా హాగ్ ఇవ్వలేదు.. లెక్కలేనన్ని సార్లు హాగ్ ఇమ్మని అడిగాను.. ఒక్కసారి ఇవ్వమ్మా.. నీ సొమ్మేం పోతుంది.. అరిగిపోతుందా.. ? తరిగిపోతుందా..? అని.. మళ్లీ పేమెంట్ కూడా ఇచ్చేసా.. అయినా ఇవ్వడం లేదు.. టచ్ చేసి చేయనట్లు అలా ముట్టుకొని వెళ్ళిపోతుంది. హాగ్ ఇస్తే ఎలా ఉండాలి కొడితే గూబ పగిలిపోయేలా ఉండాలి. కానీ ఇవ్వదే.. ఇప్పటికైనా ఇవ్వకుండా హ్యాండ్ ఇస్తుంది. అమ్మాయిలను నమ్మకండి.. ఇలాగే హ్యాండ్ ఇస్తారు.. ” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్స్ మండిపడుతున్నారు. చాలా చీప్ గా అడుగుతున్నావు బ్రో అని కామెంట్స్ పెడుతున్నారు.
మొన్నామధ్య రంభ చెప్పింది
ఇలాంటి ఇన్సిడెంట్ గురించే అనుకుంట!హగ్ ఇవ్వనందుకు
అక్కడ హీరో ఫీలయితే,
ఇక్కడ మాత్రం డైరెక్టర్ ఫీలయ్యాడు 🙏
pic.twitter.com/1qLddyBDD3— SKY (@SriKanthY_) February 10, 2024