వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు వైభవంగా జరుపుకుంటున్నారు. కోవిడ్ నిబంధనలతో గణేశుడు మండపాలల్లో కొలువుదీరాడు. పలువురు సినీ ప్రముఖులు చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో మట్టితో చేసిన వినాయకుడికి భార్యతో కలిసి పూజలు చేశారు. మరోవైపు, సినీనటుడు మోహన్ బాబు విఘ్నేశ్వరుడి పూర్తి కథను చెప్పారు. ఈ కథ చెప్పాలని తన కుమారుడు మంచు విష్ణు కోరడంతో ఈ కథ చెబుతూ ఈ ఆడియో రికార్డు చేశానని…
ఒలింపిక్ పతాక విజేత పీవీ సింధుకు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఘనంగా సన్మానం జరిగింది. ఈ వేడుకకు అక్కినేని నాగార్జునతో పాటు రాధిక, సుహాసిని సహా మెగా కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరై సింధును సన్మానించారు. ఈమేరకు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వీడియో షేర్ చేశారు. పీవీ సింధు ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది. వరుసగా రెండు ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.…
2017 టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన సెలబ్రెటీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఛార్మి, రకుల్, రానా, రవితేజ, తరుణ్, పూరీ జగన్నాథ్, నవదీప్, ముమైత్ ఖాన్, నందు, శ్రీనివాస్ ఈడీ విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేశారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకుఈ సినీ స్టార్స్ విచారణను విచారించనున్నారు. ఈ కేసుతో సంబంధం వున్నవారి నుంచి గోర్లు, తల…
(జూన్ 20న ఫాదర్స్ డే) “నాన్న అనే రెండక్షరాలు… మరపురాని మధురాక్షరాలు…” అంటూ ‘దీక్ష’ చిత్రంలో ఘంటసాల గళం పల్లవించగా, నటరత్న అభినయంతో అలరించింది ఆ పాట. ఇక ‘ధర్మదాత’లో “ఓ నాన్నా… నీ మనసే వెన్న… అమృతం కన్నా… అది ఎంతో మిన్నా…” అంటూ మరోమారు ఘంటసాల గాత్రంలోనే ఆ గీతం జాలువారింది. నటసమ్రాట్ నటనతో ఆ పాట కూడా జనాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. “బృందావనమొక ఆలయమూ…మాధవుడందలి దైవమూ…” అంటూ ‘భలేకృష్ణుడు’లో బాలు గొంతులో సాగిన…
భారత దిగ్గజ అథ్లెటిక్ ప్లేయర్ స్ప్రింటర్ మిల్కా సింగ్ కరోనాతో మరణించారు. ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. తన పరుగుతో భారత కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగురవేశాడు. మిల్కాసింగ్ నాలుగు సార్లు ఆసియా క్రీడల్లో స్వర్ణం సహా 1958 కామన్వెల్త్ గేమ్స్‌లో మిల్కా పసిడి పతకంతో మెరిశాడు. ఆయన మరణంపై యావత్ భారతం ఘన నివాళులు అర్పిస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ సినీప్రముఖులు సంతాపం తెలిపారు. “పరుగుల వీరుడు…
నేడు నందమూరి బాలకృష్ణ బర్త్ డే సందర్బంగా అభిమానులతో పాటుగా టాలీవుడ్ ప్రముఖులు విషెస్ తెలియచేస్తున్నారు. ఆయన నటిస్తున్న సినిమాల అప్డేట్స్ కూడా రావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బాలయ్య-బోయపాటి సినిమా ‘అఖండ’ నుంచి న్యూ పోస్టర్ విడుదల కాగా.. ఆయన తదుపరి సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని అధికారికంగా ప్రకటిస్తూ వీడియో విడుదల చేసింది మైత్రి మూవీ మేకర్స్. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి విషెస్ తెలుపుతూ..…