ఒలింపిక్స్ విజేత మీరా బాయి చాను…ప్రాక్టీస్ కోసం కుటుంబసభ్యులకు దూరంగా ఉంది. ఇంట్లో ఉంటే శిక్షణకు ఇబ్బందులు ఎదురవుతాయని భావించి…తల్లిదండ్రులను కలుసుకునేది కాదు. నిరంతరం కఠోరంగా శిక్షణ తీసుకోవడం వల్లే విశ్వక్రీడల్లో పతకం వచ్చేలా చేసింది. కొవిడ్ వైరస్ విజృంభణతో గతేడాది విధించిన లాక్‌డౌన్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంది చాను. విశ్రాంతి తీసుకోవడంతో కండరాలు పట్టేసేవని వెల్లడించింది. లాక్‌డౌన్ తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేయడంతో…వీపు భాగం పట్టేసేదని…కుడి భుజానికి సమస్య వచ్చినట్లు తెలిపింది. ఎక్కువ బరువులు…
ఈనెల 23 నుంచి జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం అయ్యాయి. ప్రపంచంలోని దాదాపు 200 దేశాల నుంచి వేలాదిమంది క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొనేందుకు ట్యోక్యో చేరుకున్నారు. ప్రస్తుతం ఆరు రోజులుగా క్రీడలు జరుగుతున్నాయి. క్రీడలు ప్రారంభానికి ముందే ఆ దేశంలో కరోనా కేసులు తిరిగి పెరగడం ప్రారంభించాయి. ఇక రాజధాని టోక్యోలో కేసులు క్రమంగా పెరిగే అవకాశం ఉందని క్రీడలు ప్రారంభానికి ముందే నిపుణులు హెచ్చరించారు. కాగా, రోజు రోజుకు నగరంలో కేసులు…
టోక్యో ఒలింపిక్స్‌లో మహిళా అథ్లెట్లపై ఉండే వేరే దృష్టిని మార్చే దిశగా మరో అడుగు పడింది. పోటీల సందర్భంగా అమ్మాయిల శరీరాన్ని అతిగా ప్రదర్శించేలా, వ్యక్తిగత అవయవ భాగాలు కనిపించేలా, అభ్యంతరకరంగా ఉన్న ఫొటోలు, వీడియోలను ప్రసారం చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఒలింపిక్స్ అధికారిక ప్రసారదారు ప్రకటించింది. స్పోర్ట్ అప్పీల్, నాట్ సెక్స్ అప్పీల్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు నిర్వాహకులు. మైదానంతో పాటు తెరపైనా లింగ సమానత్వం సాధించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో చూపించినట్లుగా ఈ…
టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు పతకాల ఆశలు పెంచుతున్నారు. ప్రధానంగా సింధు, మేరీకోమ్, లవ్లీనా సహా పలువురు క్రీడాకారులు.. ఒక్కో అడుగు ముందుకేస్తూ, అభిమానుల్లో ఆశలు కల్పిస్తున్నారు. మీరా చాను సిల్వర్ మెడల్ తర్వాత మరో మెడల్ కోసం భారత్ ఆశగా ఎదురుచూస్తోంది. ఇవాళ మెన్స్ గోల్ఫ్ సింగిల్స్‌లో అనిర్బన్ లాహిరి, ఉదయన్‌లు.. రౌండ్ వన్ గేమ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.25 మీటర్ల పిస్టల్ మహిళల విభాగంలో మనుభాకర్, రాహి సర్నబట్.. బరిలో దిగనున్నారు రియో ఒలింపిక్స్…
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ సమయంలో కూడా కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తూ టోక్యో ఒలింపిక్స్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది ఐవోసీ. అయితే కొవిడ్ నిబంధనలో భాగంగా అథ్లెట్లు కచ్చితంగా మాస్కులు ధరించాల్సి వస్తోంది. ఈ క్రమంలో పతకాలు అందుకుంటున్న సమయంలోనూ మాస్క్ ధరిస్తుండటంతో విజేతల ముఖాల్లో ఆనందాన్ని కెమెరాలు బంధించలేకపోతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన ఐవోసీ.. నిబంధనలో చిన్న సవరణ చేసింది. క్రీడాకారులు 30 సెకన్లు మాస్క్ తీయడానికి…
కట్టెలు ఎత్తిన చేతులతోనే భారత్‌కు వెండి పతకాన్ని సాధించి పెట్టారు వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను.. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించి.. భారత్ పతకాల ఖాతా తెరిచారామె.. ఇక, ఆమెకు బంగారం పతకం కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి.. కానీ, బంగారు పతకాన్ని అందుకున్న చైనీ క్రీడాకారిణి డోపింగ్ టెస్ట్‌లో విఫలం అయితేనే అదిసాధ్యం అవుతుంది. మరోవైపు.. ఇప్పటికే స్వదేశానికి చేరుకున్న చానుకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది.. ఇక, ఇటీవల ఆమెకు కోటి రూపాయల…
టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి.. భారత్‌ను శుభారంభాన్ని అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు గోల్డ్ మెడల్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి… 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ఆమె సిల్వర్ మెడల్ గెలుచుకోగా.. ఈ ఈవెంట్‌లో చైనా వెయిట్‌లిఫ్టర్ ఝిహుయి హౌ గోల్డ్ గెలిచింది. కానీ, ఆమెకు యాంటీ డోపింగ్ పరీక్షలు చేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు.. ఇప్పటికే మీరాబాయి చాను.. టోక్యో నుంచి భారత్‌కు చేరుకోగా… టోక్యోలోనే ఉండాల్సిందిగా హౌను ఆదేశించారు ఒలింపిక్స్ నిర్వహకులు. ఈ…
టోక్యో ఒలంపిక్స్‌లో ఇండియా క్రీడాకారులు రాణిస్తున్నారు. 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఇండియా తొలి పతకం సాధించింది. మీరాభాయ్ చాను రజత పతకం సాధించారు. తనకు పిజ్జా అంటే చాలా ఇష్టం అని, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా… పిజ్జా తింటానా అని ఉందని చెప్పుకొచ్చారు. అయితే, మీరాభాయ్ చాను కు ప్రముఖ పిజ్జా కంపెనీ డామినోస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆమెకు జీవితాంతం ఉచితంగా పిజ్జాను అందిస్తామని ప్రకటించింది. టోక్యో ఒలంపిక్స్‌లో భారత క్రీడాకారులు…
టోక్యో ఒలింపిక్స్‌లో స్టార్ షట్లర్ సింధు శుభారంభం చేసింది. గ్రూప్-జె తొలి మ్యాచ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన సెనియా పోలికర్పోవాపై విజయం సాధించింది. 21-7, 21-10 తేడాతో సింధు గెలుపొందింది. అయితే గత ఒలంపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన సింధు ఈ ఏడాది అలాగైనా గోల్డ్ సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇక మరోవైపు హైదరాబాదీ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా డబుల్స్ తొలి మ్యాచ్ ఈరోజు ఆడగా అందులో ఓటమిపాలైంది. సానియా మీర్జా, అంకిత రైనా ద్వయం..…
టోక్యో ఒలింపిక్స్‌లో బోణీ కొట్టింది భారత్… ఒలింపిక్స్‌లో తొలి రోజే పతకాల వేల ప్రారంభించిన ఇండియా.. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయ్ చాను సిల్వర్ మెడల్ సాధించారు.. ఇక, ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో కరణ మల్లీశ్వరి పతకం గెలిచిన తర్వాత మీరాబాయి చాను పతకం సాధించారు.. అయితే, ఐదేళ్ల క్రితం జరిగిన రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతుందని అంతా ఆశలు పెట్టుకున్నా.. కేవలం రెండు పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. మరోవైపు.. ఈసారి మరిన్ని అంచనాలు…