మరో కీలక నిర్ణయం తీసుకున్న ఒలింపిక్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టోక్యో ఒలింపిక్స్‌లో మహిళా అథ్లెట్లపై ఉండే వేరే దృష్టిని మార్చే దిశగా మరో అడుగు పడింది. పోటీల సందర్భంగా అమ్మాయిల శరీరాన్ని అతిగా ప్రదర్శించేలా, వ్యక్తిగత అవయవ భాగాలు కనిపించేలా, అభ్యంతరకరంగా ఉన్న ఫొటోలు, వీడియోలను ప్రసారం చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఒలింపిక్స్ అధికారిక ప్రసారదారు ప్రకటించింది. స్పోర్ట్ అప్పీల్, నాట్ సెక్స్ అప్పీల్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు నిర్వాహకులు. మైదానంతో పాటు తెరపైనా లింగ సమానత్వం సాధించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో చూపించినట్లుగా ఈ క్రీడల్లో కొన్ని సన్నివేశాలు తెరపై కనిపించవు. అథ్లెట్ల శరీర భాగాలను వివరంగా, దగ్గరగా చూపించడం ఉండదు.
ఇలా అయితే బీచ్ వాలీబాల్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, ట్రాక్ విభాగాల్లో అమ్మాయిల పోటీలను చిత్రీకరించడం ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఇలాంటి క్రీడాంశాల్లో మహిళా అథ్లెట్లు సౌకర్యం కోసం బికినీల్లాంటి కురచ దుస్తులు ధరించాల్సి ఉంటుంది. ఆ అథ్లెట్లను కొంతమంది కామ వాంఛతో చూసే ప్రమాదం ఉంది. ఇప్పటికే మహిళా జిమ్నాస్ట్‌లపై లైంగిక వేధింపులతో పాటు వాళ్లను వేరే దృష్టిలో చూడడం ఎక్కువైంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకే టోక్యోలో జర్మనీ జిమ్నాస్ట్‌లు కాలి మడమ వరకూ నిండుగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించి పోటీల్లో పాల్గొన్నారు. పోటీపడే అమ్మాయిలు వేసుకునే దుస్తులపై ఇప్పటివరకూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎలాంటి నిబంధనలు విధించలేదు కానీ ప్రసార దృశ్యాలను మాత్రం ఇప్పుడు నియంత్రించనుంది.
Also Read
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు