టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు పతకాల ఆశలు పెంచుతున్నారు. ప్రధానంగా సింధు, మేరీకోమ్, లవ్లీనా సహా పలువురు క్రీడాకారులు.. ఒక్కో అడుగు ముందుకేస్తూ, అభిమానుల్లో ఆశలు కల్పిస్తున్నారు.
మీరా చాను సిల్వర్ మెడల్ తర్వాత మరో మెడల్ కోసం భారత్ ఆశగా ఎదురుచూస్తోంది. ఇవాళ మెన్స్ గోల్ఫ్ సింగిల్స్‌లో అనిర్బన్ లాహిరి, ఉదయన్‌లు.. రౌండ్ వన్ గేమ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.25 మీటర్ల పిస్టల్ మహిళల విభాగంలో మనుభాకర్, రాహి సర్నబట్.. బరిలో దిగనున్నారు
రియో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ పివి సింధు… మరోసారి ఒలింపిక్స్ బరిలో గెలుపు దిశగా సాగుతున్నారు.ఇవాళ సింధు.. డెన్మార్క్ క్రీడాకారిణి మియాతో తలపడనుంది. ఇక మెన్స్ హాకీ టీమ్.. డిపెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో తలపడాల్సి ఉంది.
2012 లండన్ ఒలింపిక్స్ కాంస్యపతక విజేత మేరీకోమ్… కొలంబియా క్రీడాకారిణి వలెన్సియాతో తలపడనున్నారు. ఆర్చరీలో అటానుదాస్.. మెన్స్ విభాగంలో తలపడనున్నారు. 91 కిలోల హెవీ విభాగంలో సతీష్ కుమార్.. ప్రత్యర్థి రికార్డియోను ఢీ కొంటారు. మెన్స్ 100 మీటర్లు బటర్‌ఫ్లై విభాగంలో సజన్ ప్రకాశ్ తలపడనున్నారు. పురుషుల సింగిల్స్ గ్రూప్ దశలో సాయి ప్రణీత్.. ఫైట్ చేయనున్నారు. ఆర్చరీ పురుషుల సింగిల్స్‌లో తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్, మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్ దీపికా కుమారి తలపడనున్నారు . బాక్సింగ్ మహిళల 75 కిలోల విభాగంలో పూజారాణి.. ప్రత్యర్థితో తలపడనున్నారు.