టోక్యో ఒలంపిక్స్ లో భారత క్రీడాకారిణి పీవీ సింధూ జైత్రయాత్ర కొనసాగుతుంది. నేడు బ్యాడ్మింటన్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జపాన్ ప్లేయర్ యమగూచీపై విజయం సాధించి సెమీస్ లో అడుగు పెట్టింది పీవీ సింధూ. అయితే మ్యాచ్ ప్రారంభ సమయం నుండి జపాన్ ప్లేయర్ పైన తన ఆధిపత్యం చూపిస్తూ వచ్చింది. వరసగా రెండు సెట్లు 21- 13, 22-20 తో కైవసం చేసుకున్న పీవీ సింధూ విజయాన్ని ఖాతాలో వేసుకొని ఫైనల్ 4 లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే గత ఒలంపిక్స్ లో సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్న సింధూ ఈసారి ఎలాగైనా గోల్డ్ సాధించాలనే పట్టుదలతో ఉంది.