టోక్యో ఒలింపిక్స్: సెమీస్‌కు చేరిన ఇండియా మహిళల హాకీ టీమ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు దూసుకుపోతున్నది. నిన్నటి రోజున పురుషుల హాకీ జట్టు బ్రిటన్‌ను ఓడించి సెమీస్‌కు చేరుకున్నది. 3-1తేడాతో బ్రిటన్‌ను ఓడించి సెమీస్‌లో బెల్జియంతో తలపడేందుకు సిద్ధమైంది. కాగా, అదే బాటలో ఇప్పుడు మహిళల హాకీ టీమ్ కూడా పయనిస్తోంది. మహిళల హాకీ టీమ్ బలమైన ఆస్ట్రేలియాపై 1-0 తేడాతో ఓడించి సెమీస్ కు చేరుకున్నది. మొదటి క్వార్టర్‌లో ఏ జట్టు కూడా గోల్ చేయలేదు. రెండో క్వార్టర్ 22 వ నిమిషం వద్ద భారత్ క్రీడాకారిణి గుర్జిత్ కౌర్ గోల్ చేసింది. దీంతో ఇండియా 1-0 లీడ్‌లోకి రావడంతో ఆస్ట్రేలియా జట్టు దూకుడు పెంచింది. గోల్ చేసేందుకు శతవిధాల ప్రయత్నం చేసింది. అయితే, ఆస్ట్రేలియా ప్రయత్నాలను భారత టీమ్ సమర్ధవంతంగా నిలువరించడంతో ఇండియా జట్టు 1-0 తేడాతో విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. 1980 లో జరిగిన మాస్కో ఒలింపిక్స్‌లో భారత మహిళల జట్టు 4వ స్థానంలో నిలిచింది. ఆ తరువాత జరిగిన ఒలింపిక్స్‌లో చెప్పుకోదగిన విధంగా రాణించలేకపోయింది. కాగా, ఇప్పుడు టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత హాకీ ఆటగాళ్లు మెరుగ్గా రాణిస్తున్నారు.
Read: రాజ్ కుంద్రా కేసు : శిల్పా శెట్టికి హీరోయిన్ సపోర్ట్
Also Read
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!