Today Stock Market Roundup 27-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ గురువారం ఉదయం మందకొడిగా ట్రేడింగ్ ప్రారంభించినప్పటికీ మధ్యాహ్నం చెప్పుకోదగ్గ లాభాలతో ముగిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సూచీలు క్రమంగా పెరిగాయి.
Today Stock Market Roundup 21-04-23: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని స్వల్ప లాభాలతో ముగించాయి. ఇవాళ ఉదయం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడినప్పటికీ ఆ ప్రభావం ఇండియన్ మార్కెట్‌పై పెద్దగా కనిపించలేదు. దీంతో కీలక సూచీలు లాభాలతోనే ప్రారంభమయ్యాయి.
Today Stock Market Roundup 13-04-23: మన దేశ స్టాక్ మార్కెట్ ఈ వారంలో వరుసగా నాలుగో రోజు, మొత్తమ్మీద తొమ్మిదో రోజు కూడా లాభాలతో ముగిసింది. ఇవాళ గురువారం ఉదయం రెండు కీలక సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావటంతో వరుస లాభాలకు బ్రేక్ పడింది.
Today Stock Market Roundup 06-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ గురువారం ఓ మోస్తరు లాభాలతో ముగిసింది. ఎర్లీ ట్రేడింగులో ఊగిసలాట ధోరణిలో జరిగిన ట్రేడింగ్ కారణంగా వచ్చిన నష్టాలను ఇంట్రాడేలో పూడ్చుకోగలిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచకపోవటం కలిసొచ్చింది. జీడీపీ గ్రోత్ మరియు ద్రవ్యోల్బణానికి సంబంధించి ఆర్బీఐ వెల్లడించిన గణాంకాలు ఈక్విటీ మార్కెట్ పెట్టుబడిదారుల సెంటిమెంటును బలపరిచాయి.
Stock Market Roundup 03-03-23: ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈ వారాంతాన్ని లాభాలతో ముగించింది. ఇవాళ శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు సాయంత్రం భారీ లాభాలతో ఎండ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి అనుకూల సంకేతాలు వెలువడటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ని బలపరిచింది. లార్జ్ క్యాప్స్ అయిన ఎస్‌బీఐ, రిలయెన్స్ ఇండస్ట్రీస్, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మరియు భారతీ ఎయిర్‌టెల్ విశేషంగా రాణించాయి.
Today (02-01-22) Stock Market Roundup: నూతన సంవత్సరం 2023లో దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ సోమవారం తొలి ట్రేడింగ్ సెషన్ నిర్వహించింది. అయితే.. ఈ కొత్త ఏడాదిలో శుభారంభం లభించలేదు. ఇవాళ ఉదయం రెండు సూచీలు కూడా నష్టాలతోనే ప్రారంభమై ఇంట్రడేలో ఫ్లాట్‌గా కొనసాగాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్, ఐటీ, ఎఫ్ఎంసీజీ మరియు ఫార్మా రంగాల్లో షేర్ల అమ్మకాలు జరగటంతో ఈ పరిస్థితి నెలకొంది. మెటల్ సెక్టార్ స్టాక్స్ ససోర్ట్‌తో ఎట్టకేలకు పుంజుకొని లాభాల్లో ముగిశాయి.
Today (27-12-22) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌లో క్రిస్మస్ మరుసటి రోజు నుంచి.. అంటే.. గడచిన రెండు రోజులుగా లాభాలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ ట్రెండ్‌ను శాంతాక్లాజ్ ర్యాలీగా పేర్కొంటున్నారు. గ్లోబల్ మార్కెట్ నుంచి కూడా ఇవాళ సానుకూల సంకేతాలు వెలువడ్డాయి. చైనాలో సైతం కొవిడ్ సంబంధిత ఆంక్షలను మరింతగా సడలిస్తున్నట్లు ప్రకటించటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు బూస్ట్‌లా పనిచేసింది. దీంతో రెండు సూచీలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో గ్రోత్ నమోదు చేశాయి.
Today (26-12-22) Stock Market Roundup: గతవారం మొత్తం వెంటాడిన కొవిడ్ భయాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్ ఎట్టకేలకు కోలుకుంది. ఈ వారం శుభారంభం లభించింది. ఇవాళ సోమవారం లాభాలతో మొదలై లాభాలతోనే ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఆ ప్రభావం ఇండియన్ మార్కెట్‌పై ఏమాత్రం పడకపోవటం గమనించాల్సి విషయం. రెండు సూచీలు కూడా బెంచ్ మార్క్‌కు పైనే ట్రేడ్ అవటం ఈ రోజు చెప్పుకోదగ్గ అంశం.
Today(20-12-22) Stock Market Roundup: ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ నిన్న సోమవారం శుభారంభమైనప్పటికీ ఇవాళ మంగళవారం మళ్లీ నష్టాల బాట పట్టింది. లాభం అనేది ఒక్క రోజు ముచ్చటగానే మిగిలిపోయింది. ఈ రోజు మొత్తం లాస్‌లోనే నడిచింది. సెన్సెక్స్ 103 పాయింట్లు కోల్పోయి 61 వేల 702 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 32 పాయింట్లు తగ్గి 18 వేల 388 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం 50 స్టాక్స్‌లో 39 స్టాక్స్‌కి…
Today (19-12-22) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌కు ఈ వారం శుభారంభం లభించింది. ఇవాళ సోమవారం ఉదయం రెండు సూచీలు కూడా ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ కాసేపట్లోనే లాభాల బాట పట్టి చివరికి భారీ ప్రాఫిట్స్‌తో ముగిశాయి. సెన్సెక్స్ 468 పాయింట్లు పెరిగి 61 వేల 806 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 157 పాయింట్లు ప్లస్సయి 18 వేల 426 పాయింట్ల వద్ద ముగిసింది.