Today (02-01-22) Stock Market Roundup: నూతన సంవత్సరం 2023లో దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ సోమవారం తొలి ట్రేడింగ్ సెషన్ నిర్వహించింది. అయితే.. ఈ కొత్త ఏడాదిలో శుభారంభం లభించలేదు. ఇవాళ ఉదయం రెండు సూచీలు కూడా నష్టాలతోనే ప్రారంభమై ఇంట్రడేలో ఫ్లాట్‌గా కొనసాగాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్, ఐటీ, ఎఫ్ఎంసీజీ మరియు ఫార్మా రంగాల్లో షేర్ల అమ్మకాలు జరగటంతో ఈ పరిస్థితి నెలకొంది. మెటల్ సెక్టార్ స్టాక్స్ ససోర్ట్‌తో ఎట్టకేలకు పుంజుకొని లాభాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ 327 పాయింట్లు పెరిగి మరోసారి 61 వేల మార్క్‌ను దాటింది. చివరికి 61,167 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 92 పాయింట్లు ప్లస్సయి 18,197 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 సంస్థల్లో 23 సంస్థలు లాభాల బాటలో నడిచాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎంసీఎక్స్ ఇండియా, ఎన్‌సీసీ భారీగా నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ 0.07 శాతం లాభపడగా స్మాల్‌క్యాప్ 0.12 శాతం పెరిగాయి. ఓలటాలిటీ ఇండెక్స్ దాదాపు 4 శాతం అడ్వాన్స్ అయింది.
read also: Today (02-01-23) Business Headlines: ‘న్యూఇయర్’ వేళ.. హైదరాబాద్ బిర్యానీకి అత్యధిక ఆర్డర్లు
నిఫ్టీలో టాటా స్టీల్, హిండాల్కో, ఓఎన్‌జీసీ టాప్ లీడర్స్‌గా నిలిచాయి. ఫార్మా సెక్టార్ మాత్రమే నెగెటివ్ రిజల్ట్స్ పొందింది. వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. MOIL నాలుగు శాతం ర్యాలీ తీసింది. నవంబర్‌తో పోల్చితే డిసెంబర్‌లో ఈ సంస్థ.. ఉత్పత్తి మరియు అమ్మకాల విషయంలో అత్యుత్తమ పనితీరును నమోదుచేయటంతో షేర్ల విలువ భారీగా పెరిగింది. టాటా స్టీల్ కూడా సుమారు 5 శాతం లాభాలను ఆర్జించింది. టాటా మోటార్స్ స్టాక్స్ వ్యాల్యూ సైతం ఒకటీ పాయింట్ 6 శాతం పెరిగింది.
రంగాల వారీగా పరిశీలిస్తే.. నిఫ్టీలో మెటల్ స్టాక్స్ విలువ 2 శాతానికి పైగా పెరిగి బెస్ట్ పెర్ఫార్మర్‌గా నిలిచాయి. 10 గ్రాముల బంగారం రేటు 133 రూపాయలు పెరిగి గరిష్టంగా 55,150 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 165 రూపాయలు లాభపడి 69,578 రూపాయల వద్ద ముగిసింది. రూపాయి వ్యాల్యూ ఒక పైసా కోల్పోయింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 82 పైసల వద్ద స్థిరపడింది.