Stock Market Roundup 03-03-23: ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈ వారాంతాన్ని లాభాలతో ముగించింది. ఇవాళ శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు సాయంత్రం భారీ లాభాలతో ఎండ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి అనుకూల సంకేతాలు వెలువడటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ని బలపరిచింది. లార్జ్ క్యాప్స్ అయిన ఎస్‌బీఐ, రిలయెన్స్ ఇండస్ట్రీస్, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మరియు భారతీ ఎయిర్‌టెల్ విశేషంగా రాణించాయి.
read more: Increments in India: భారతీయ సంస్థల్లో ఈ ఏడాది వేతనాల పెంపు పరిస్థితిపై సర్వే
సెన్సెక్స్ 899 పాయింట్లు పెరిగి 59 వేల 808 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 272 పాయింట్లు పెరిగి 17 వేల 594 పాయింట్ల వద్ద ముగిసింది. సెక్టార్ల వారీగా చూసుకుంటే.. అన్ని రంగాల కంపెనీల షేర్లు లాభాల్లోనే నడిచాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ మెటల్ ఇండెక్స్‌లు మూడు శాతం వరకు పెరిగాయి. వ్యక్తిగత స్టాక్స్ పరిశీలిస్తే.. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు 14 శాతం దాక ర్యాలీ తీశాయి.
నాలుగు కంపెనీల్లో వాటాలను విక్రయించటం కలిసొచ్చింది. అలెంబిక్ ఫార్మా సంస్థ స్టాక్స్ విలువ 52 వారాల గరిష్టానికి చేరింది. 10 గ్రాముల బంగారం ధర 99 రూపాయలు పెరిగింది. గరిష్టంగా 55 వేల 838 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు 478 రూపాయలు లాభపడింది. అత్యధికంగా 63 వేల 734 రూపాయలు పలికింది.
క్రూడాయిల్ ధర స్వల్పంగా 43 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 394 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 36 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 25 పైసల వద్ద స్థిరపడింది.