Today Business Headlines 02-05-23: జీఎస్టీ వసూళ్లు సూపర్: ఏప్రిల్ నెలలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వసూళ్లు గతంలో ఎన్నడూలేనంతగా నమోదయ్యాయి. లైఫ్ టైం హయ్యస్ట్ లెవల్‌లో ఒకటీ పాయింట్ ఎనిమిదీ ఏడు లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి.
Today (09-01-23) Business Headlines: ‘పేటీఎం’కి సురిందర్ చావ్లా: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సురిందర్ చావ్లా నియమితులయ్యారు. ఈ నియామకాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆమోదించింది. సురిందర్ చావ్లా గతంలో ఆర్‌బీఎల్ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా చేశారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓగా మూడేళ్లపాటు ఉంటారు.
Today (07-01-23) Business Headlines: గ్లాండ్ ఫార్మా చేతికి ఐరోపా సంస్థ: ఐరోపా సంస్థ సెనెగ్జి గ్రూపులో మొత్తం వాటా కొనుగోలు చేసేందుకు హైదరాబాద్‌లోని ప్రముఖ కంపెనీ గ్లాండ్ ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్ అనుబంధ సంస్థ గ్లాండ్ ఫార్మా ఇంటర్నేషనల్ పీటీఈ ద్వారా ఈ షేరును దక్కించుకుంటుంది. దాదాపు 20 ఏళ్ల కిందట ఏర్పాటైన సెనెగ్జి గ్రూపు.. ఫ్రాన్స్ మరియు బెల్జియం దేశాల్లో ఔషధాల అభివృద్ధి, ఉత్పత్తి తదితర పనులు చేస్తోంది.
Today (02-01-23) Business Headlines: హైదరాబాద్ బిర్యానీకి అత్యధిక ఆర్డర్లు: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ పండగ చేసుకుంది. దేశవ్యాప్తంగా మూడున్నర లక్షల బిర్యానీలను మరియు రెండున్నర లక్షలకు పైగా పిజ్జా ఆర్డర్లను డెలివరీ చేసింది. 75 శాతం మందికి పైగా కస్టమర్లు హైదరాబాద్ బిర్యానీనే కోరుకున్నారని ట్విట్టర్‌లో నిర్వహించిన సర్వేలో తేలినట్లు స్విగ్గీ వెల్లడించింది.
Today (30-12-22) Business Headlines: ‘హైదరాబాద్ చాక్లెట్’ కొన్న రిలయెన్స్: సీనియర్ మోస్ట్ సినీ నటి శారద మరియు విజయ రాఘవన్ నంబియార్ సంయుక్తంగా 1988వ సంవత్సరంలో ప్రారంభించిన లోటల్ చాక్లెట్ కంపెనీని.. రిలయెన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ చాక్లెట్ కంపెనీ ప్రస్తుతం సింగపూర్ సంస్థ సన్‌షైన్ అలైడ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి అనుబంధంగా.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది.
Today (28-12-22) Business Headlines: రికార్డ్ స్థాయిలో ఇళ్ల అమ్మకాలు: హైదరాబాద్‌లో ఈ ఏడాది ఇళ్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఏడేళ్ల కిందట.. అంటే.. 2014లో.. అత్యధికంగా 3 పాయింట్ నాలుగు మూడు లక్షల నివాసాలు సేల్ అవగా ఈ సంవత్సరం 3 పాయింట్ ఆరు ఐదు లక్షల గృహాల విక్రయాలు జరిగాయి. గతేడాది 25 వేల 406 ఇళ్ల అమ్మకాలు జరగ్గా ఈ ఏడాది 87 శాతం ఎక్కువగా 47 వేల 487
Today (27-12-22) Business Headlines: ‘‘పవర్ మెక్’’కి ఖాజీపేట: హైదరాబాద్‌కు చెందిన పవర్ మెక్ ప్రాజెక్ట్స్ అనే సంస్థ కొత్తగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా విలువైన లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఆర్డర్లను దక్కించుకుంది. లోకల్ కేటగిరీలో తెలంగాణలోని ఖాజీపేటలో 306 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో వ్యాగన్ రిపేర్ వర్క్‌షాపు నిర్మించనుంది. నేషనల్ లెవల్‌లో అదానీ గ్రూపు నుంచి 608 కోట్ల రూపాయల ఆర్డర్ పొందింది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని ఆ…
Today (24-12-22) Business Headlines: శ్రీరామ్ ఆల్ ఇన్ ఒన్ ఆర్థిక సేవలు: శ్రీరాం ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్, శ్రీరాం సిటీ యూనియన్ విలీనమై శ్రీరాం ఫైనాన్స్ లిమిటెడ్ అనే కంపెనీగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కస్టమర్లు వివిధ లోన్ల కోసం వేర్వేరు శాఖలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టారు. అన్ని బ్రాంచిల్లో అన్ని రకాల ఆర్థిక సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని సంస్థ ఎండీ అండ్ సీఈఓ వైఎస్ చక్రవర్తి వెల్లడించారు.
Today (23-12-22) Business Headlines: ఎయిర్‌టెల్-అపోలో దోస్తీ: ఆరోగ్య సంరక్షణ రంగంలో అధునాతన 5జీ టెక్నాలజీని వాడుకోవటానికి ఎయిర్‌టెల్ మరియు అపోలో హాస్పిటల్స్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. 5జీ టెక్నాలజీతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను కూడా వినియోగించుకున్నాయి. హెల్త్‌నెట్ గ్లోబల్, ఏడబ్ల్యూఎస్ మరియు అవేషా అనే సంస్థలను కూడా కలుపుకొని కలనోస్కోపీ ట్రయల్స్ నిర్వహించాయి. కలనోస్కోపీ ట్రయల్స్.. అంటే.. పెద్ద పేగు పరిశీలనకు సంబంధించిన పరీక్షలను చేపట్టాయి.
Today (22-12-22) Business Headlines: ఆజాద్ ఇంజనీరింగ్ స్పెషల్ యూనిట్: హైదరాబాద్‌కు చెందిన ఆజాద్ ఇంజనీరింగ్ కంపెనీ.. జపాన్ సంస్థ మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ కోసం స్పెషల్ యూనిట్‌ని ఏర్పాటుచేస్తోంది. మేడ్చల్‌కి దగ్గరలోని తునికిబొల్లారం ప్రాంతంలో తలపెట్టిన ఈ యూనిట్ నిర్మాణానికి నిన్న బుధవారం భూమి పూజ చేశారు. సుమారు 165 కోట్ల రూపాయలు వెచ్చించి అందుబాటులోకి తేనున్న ఈ కేంద్రంలో స్టీమ్ లేదా గ్యాస్ ఎయిర్ ఫాయిల్స్‌ను తయారుచేసి మిత్సుబిషికి సప్లై చేస్తుంది.