Today(21-12-22) Business Headlines: దావోస్‌కు మంత్రి కేటీఆర్: తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. వచ్చే నెలలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కి వెళ్లనున్నారు. జనవరి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అక్కడ జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొననున్నారు. ఇండియా నుంచి దాదాపు వంద మందికి పైగా హాజరుకానున్న ఈ సదస్సుకు తెలంగాణ నుంచి ప్రస్తుతానికి కేటీఆర్ పేరు ఒక్కటే తెర మీదికి వచ్చింది.
Today Business Headlines 16-12-22: హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ 5జీ సర్వీసులు: హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాకపోతే కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో మాత్రమే ఈ సర్వీసులు లభిస్తాయని పేర్కొంది. మెట్రో రైల్ మరియు రైల్వే స్టేషన్లు, పెద్ద బస్టాండ్ వంటి ప్రధాన రవాణా ప్రదేశాల్లో పొందొచ్చని తెలిపింది. అన్ని రకాల 5జీ ఫోన్లలో సిమ్ కార్డ్ మార్చాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం ఉన్న 4జీ సిమ్‌తోనే ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు.
8 బిలియన్ డాలర్లు తగ్గిన ఫారెక్స్ నిల్వలు మన విదేశీ మారక నిల్వలు ఈ నెల 8వ తేదీ నాటికి 8 బిలియన్ డాలర్లు తగ్గాయి. ఫారెక్స్ రిజర్వ్‌లను పెంచేందుకు ఆర్బీఐ ఈ నెల 6వ తేదీన కొన్ని చర్యలను ప్రకటించింది. అయితే ఆ చర్యల ఫలితాలు కనిపించటానికి కొంచెం టైం పడుతుందని ఆర్థికవేత్తలు తెలిపారు. ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు 580.3 బిలియన్ డాలర్లు ఉన్నాయి. 8 పైసలు కోలుకున్న రూపాయి. ఇటీవలి కాలంలో రికార్డు…
భారీగా తగ్గిన డీమ్యాట్ ఖాతాలు డీమ్యాట్ ఖాతాలు భారీగా తగ్గుతున్నాయి. జూన్‌లో కొత్తగా 17 పాయింట్ 9 లక్షల అకౌంట్లను మాత్రమే తెరిచారు. 2021 ఫిబ్రవరితో పోల్చితే ఇదే తక్కువ సంఖ్య అని చెబుతున్నారు. దీంతో ఈక్విటీలు 13 నెలల కనిష్టానికి పడిపోతున్నాయి. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ పాతిక శాతం తగ్గాయి. 79.44కి పడిపోయిన రూపాయి రూపాయి మారకం విలువ తాజాగా మరోసారి తగ్గింది. నిన్న సోమవారం 79 పాయింట్ నాలుగు నాలుగు వద్ద…
అక్టోబర్ నుంచి ద్రవ్యోల్బణం తగ్గొచ్చు అక్టోబర్ నుంచి ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలున్నాయని ఆర్బీఐ అంచనా వేస్తోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ధరల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండదేమోనని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. సరుకు రవాణా వ్యవస్థలో అవాంతరాల వల్ల నిత్యవసరాల ధరలు నింగినంటాయి. అయితే ఉక్రెయిన్‌పై నాలుగు నెలలుగా…