పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది… త్రిపురలో పర్యటిస్తున్నారు అభిషేక్ బెనర్జీ.. అయితే, ఆయన కాన్వాయ్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడికి పాల్పడ్డారు.. వారు బీజేపీ జెండాలను పట్టుకుని ఉన్నారు.. అయితే, తనపై దాడికి పాల్పడింది బీజేపీ నేతలేనంటూ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు అభిషేక్ బెనర్జీ.. బీజేపీ నాయకత్వంలోని త్రిపురలో ప్రజాస్వామ్యం ఇలా ఉంది అంటూ మండిపడ్డ ఆయన.. విప్లవ్ దేవ్ మీరు…
ఇటీవల పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మూడోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నేతలు బీజేపీపైన, ప్రధాని మోడీపైన పలురకాల విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇక, టిఎంసీ పార్టీ ఎమ్మెల్యే మదన్ మిత్ర చాయ్‌వాలా అవతారం ఎత్తారు. ప్రజలకు ఆయన ఉచితంగా టీ తయారు చేసి అందించారు. టీ ధర రూ.15 లక్షలు అని ప్రజలు రూ.15 లక్షలు కట్టాలని, 2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి…
ఐదురోజుల ఢిల్లీటూర్‌లో బెంగాల్ సీఎం మమత బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై పోరాటంలో విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బుధవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, రాహుల్ గాంధీలతో సమావేశమైన మమత… తమ మధ్య సమావేశం పూర్తి సానుకూలదోరణిలో జరిగిందన్నారు. దీని ఫలితాలు భవిష్యత్తులో కనిపిస్తాయన్నారు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ బంపర్ విక్టరీ తర్వాత తొలిసారిగా మమత.. సోనియాతో సమావేశమయ్యారు. ఢిల్లీలో వరుసగా విపక్షనేతలతో మమత సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న…
బెంగాల్ సీఎంగా మూడోసారి ఎంపికయ్యాక మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటకు వెళ్లారు. ఢిల్లీలో ప్రధాని మోడితో సహా అనేక మంది నేతలతో దీదీ భేటీ కాబోతున్నారు. కొద్ది సేపటి క్రితమే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన వరద సాయం, వ్యాక్సిన్ డోసులు, రాష్ట్రం పేరు మార్పు తదితర విషయాలపై ఆమె ప్రధానితో చర్చించారు. ప్రస్తుతం దేశాన్ని పెగాసస్ స్పేవేర్ అంశం కుదిపేస్తున్నది. దీనిపై పార్లమెంట్‌లో పూర్తి స్థాయిలో చర్చ…
ఐదు రోజుల పర్యటన కోసం మమత బెనర్జీ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ టూర్లో విపక్ష నేతలతో పాటు.. ప్రధాని మోడీని కలుస్తారని తెలుస్తోంది. బీజేపీ వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయాలని మమత భావిస్తున్నట్లు సమాచారం. అందుకే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఇతర విపక్ష నేతలను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. జులై 28న ప్రధాని మోడీని, రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌ను కలవనున్నారు మమతా బెనర్జీ.. అయితే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి…
దేశ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. పశ్చిమ బెంగాల్‌లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూసిన బీజేపీని ఢీకొట్టి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారు. మోడీని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతున్నారు. అన్ని రాష్ట్రాల్లోను బీజేపీని ఒడించేందుకు కొన్ని పార్టీలు కలిపి పోటీ చేస్తుండేవి. కానీ, పశ్చిమ బెంగాల్‌లో మమత ఒక్కరే తలపడ్డారు. గతంలో వచ్చిన స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో ఆ…
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఊహించినదానికి వ్యతిరేకంగా ఫలితాలు వెలువడ్డాయి. ఎట్టిపరిస్థితుల్లో కూడా బీజేపీ 170 నుంచి 180 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఫలితాలు తృణమూల్‌కు అనుకూలంగా రావడంతో అంతా షాక్ అయ్యారు. అయితే, నందిగ్రామ్‌లో నువ్వానేనా అన్నట్టుగా సాగిన పోరులో బీజేపీ నేత సువేందు అధికారి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై పార్టీ సమీక్షను నిర్వహించింది. ఇక ఇదిలా ఉంటే, పూర్వ మేదినీపూర్ జిల్లాలోని చందీపూర్…
2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన శతృఘ్న సిన్హా ఆ తరువాత బీజేపీని వదలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాగా, గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీతో కూడా దూరంగా ఉంటున్న శతృఘ్న సిన్హా మరోసారి పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే, ఈసారి ఆయన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. Read: ఏపీ…
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో సుదీర్ఘ మంతనాలు జరిపారు.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తన వ్యూహాలతో దీదీని తిరిగి సీఎం పీఠం ఎక్కిన పీకే.. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో మూడో ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో ఆయన దీదీతో సుదీర్ఘ మంతనాలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.. మమత బెనర్జీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో.. రాష్ట్ర…